Tech Tip: జీ-మెయిల్‌లో లార్జ్‌ ఫైల్స్‌ను సెండ్‌ చేయడం ఎలా?

Tech Tip- Gmail: నిత్యం వినియోగించే జీ- మెయిల్‌లో కూడా లార్జ్‌ డేటా ఫైల్స్‌ను ఎలా సెండ్‌ చేయొచ్చు.

Published : 14 Apr 2024 09:53 IST

Gmail | ఇంటర్నెట్‌డెస్క్‌: నిత్యం వినియోగించే ఇ-మెయిల్‌ సేవల్లో జీ-మెయిల్‌ (Gmail) ముందు వరుసలో ఉంటుంది. గూగుల్‌కు చెందిన ఈ సేవల్ని ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా వినియోగిస్తుంటారు. క్వాలిటీ మిస్‌ కాకుండా ఫొటోలు పంపాలన్నా, ముఖ్యమైన ఫైల్స్‌, డాక్యుమెంట్లు సెండ్‌ చేయాలన్నా జీ- మెయిల్‌నే ఎక్కువమంది వాడుతుంటారు. అయితే 25MB కంటే ఎక్కువ స్టోరేజ్‌ ఉన్న ఫైల్స్‌ను పంపేందుకు ప్రయత్నిస్తే జీ- మెయిల్‌ మిమ్మల్ని అడ్డుకుంటుంది. ఇలాంటి సమస్య తలెత్తకుండా సులువుగా లార్జ్‌ డేటా డాక్యుమెంట్లు పంపేందుకు ఓ పరిష్కారం ఉంది.

ఎలా సెండ్‌ చేయాలి?

  • ముందుగా మీరు పంపించాలనుకుంటున్న ఫైల్‌, వీడియో ఏదైనా గూగుల్‌ డ్రైవ్‌లో అప్‌లోడ్ చేయాలి.
  • జీ- మెయిల్‌ పంపే సమయంలో కుడివైపు స్క్రీన్‌పై కనిపించే డ్రైవ్‌ ఐకాన్‌ ఎంచుకోవాలి. అదే డెస్క్‌టాప్‌లో అయితే ఈ ఐకాన్‌ కింద ఉంటుంది.
  • ఐకాన్‌ను క్లిక్‌ చేయగానే రెండు ఆప్షన్లు కనిపిస్తాయి. అందులో కనిపించే ‘Insert from Drive’ ఆప్షన్‌పై క్లిక్‌ చేసి ‘My Drive’ను ఎంచుకోవాలి.
  • వెంటనే మీరు గూగుల్‌ డ్రైవ్‌లో అటాచ్‌ చేసిన ఫైల్స్‌ దర్శనమిస్తాయి. అందులో పంపించాలనుకుంటున్న లార్జ్‌ ఫైల్‌ని ఎంచుకొని ‘Select’పై క్లిక్‌ చేయాలి.
  • మీరు సెలెక్ట్‌ చేసుకున్న ఫైల్‌కు సంబంధించిన లింక్‌ను గూగుల్‌ క్రియేట్‌ చేసి ఆటోమెటిక్‌గా ఇ-మెయిల్‌కి పంపిస్తుంది.
  • మెయిల్‌ సెండ్‌ చేసే ముందు లింక్‌ను కేవలం అందుకున్నవారు మాత్రమే యాక్సెస్‌ చేయాలా?ఎవరైనా యాక్సెస్‌ చేయొచ్చా? అనే ఆప్షన్లు కనిపిస్తాయి. మీకు నచ్చిన దాన్ని ఎంచుకుని మెయిల్‌ సెండ్‌ చేయొచ్చు.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని