Elon Musk: ఓపెన్‌ ఏఐ, శామ్‌ ఆల్ట్‌మన్‌పై మస్క్‌ దావా

Elon Musk: ప్రపంచ కుబేరుల్లో ఒకరైన ఎలాన్‌ మస్క్‌ ఒప్పందాలను ఉల్లంఘించిన కారణంగా ఓపెన్‌ ఏఐ సంస్థ, సీఈఓ శామ్‌ ఆల్ట్‌మన్‌పై దావా దాఖలు చేశారు.

Published : 01 Mar 2024 22:07 IST

Elon Musk | ఇంటర్నెట్‌డెస్క్‌: చాట్‌జీపీటీని రూపొందించిన సంస్థ ఓపెన్‌ఏఐ (Open AI), దాని సీఈఓ శామ్‌ ఆల్ట్‌మన్‌ (Sam Altman)పై టెస్లా అధినేత ఎలాన్‌మస్క్‌ (Elon Musk) దావా వేశారు. చాట్‌జీపీటీ రూపొందించే సమయంలో కుదిరిన ఒప్పందాలను ఉల్లంఘించిన కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఈమేరకు శాన్‌ఫ్రాన్సిస్కో కోర్టులో గురువారం దావా వేసినట్లు వెల్లడించారు.

ఈ దావాలో మస్క్‌ కీలక విషయాలను పేర్కొన్నారు. ఓపెన్‌ఏఐని రూపొందించే సమయంలో సంస్థ సహ వ్యవస్థాపకుడు గ్రెగ్ బ్రోక్‌మన్‌, శామ్‌ ఆల్ట్‌మన్‌ కలసి మానవాళి ప్రయోజనం కోసం ఏఐ సాంకేతికతతో అభివృద్ధి చేసే లాభాపేక్ష లేని సంస్థగా మార్చడమే లక్ష్యమని తనకు వివరించారు. కానీ, మైక్రోసాఫ్ట్‌తో కలసి లాభాల కోసం పనిచేసే సంస్థగా మారిందని మస్క్‌ తన వ్యాజ్యంలో పేర్కొన్నారు.

పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌కు మరో షాక్‌.. రూ.5.49 కోట్లు జరిమానా

2022 నవంబరులో వచ్చిన చాట్‌జీపీటీ ఆరు నెలల్లోనే ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఆదరణ సంపాదించుకున్న సంగతి తెలిసిందే. 2015లో ఓపెన్‌ఏఐను శామ్‌ ఆల్టమన్‌ బృందం స్థాపించినప్పుడు మస్క్ అందులో పెట్టుబడులు పెట్టారు. 2018లో సంస్థ నుంచి పెట్టుబడులను ఉపసంహరించుకున్నారు. 2022 అక్టోబరులో 44 బిలియన్‌ డాలర్లతో ట్విట్టర్‌ (ప్రస్తుతం ఎక్స్‌)ను కొనుగోలు చేసిన విషయం తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని