పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌కు మరో షాక్‌.. రూ.5.49 కోట్లు జరిమానా

Paytm payments bank: పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌కు భారీ షాక్‌ తగిలింది. మనీలాండరింగ్‌ నిబంధనల ఉల్లంఘన కింద రూ.5.49 కోట్ల జరిమానా పడింది.

Updated : 01 Mar 2024 19:48 IST

దిల్లీ: పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌కు (Paytm payments bank) మరో షాక్‌ తగిలింది. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖకు చెందిన ఫైనాన్షియల్‌ ఇంటెలిజెన్స్‌ యూనిట్‌ (FIU) రూ.5.49 కోట్ల జరిమానా విధించింది. మనీలాండరింగ్‌ నిరోధక చట్టం నిబంధనలు ఉల్లంఘించినందుకు గానూ ఈ జరిమానా విధించినట్లు ఓ ప్రకటనలో పేర్కొంది.

షావోమీ యూజర్లా.. హైపర్‌ ఓఎస్‌ మీ ఫోన్లకు ఎప్పుడంటే?

ఆన్‌లైన్‌ జూదం సహా అనేక అనైతిక కార్యకలాపాల విషయంలో కొన్ని సంస్థలకు సంబంధించిన ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఏజెన్సీల నుంచి నిర్దిష్ట సమాచారాన్ని ఈ యూనిట్‌ అందుకుంది. ఆపై సమీక్ష నిర్వహించిన పేటీఎంపై భారీ మొత్తంలో జరిమానా విధించింది. చట్ట విరుద్ధమైన కార్యకలాపాల నుంచి వచ్చిన సొమ్మును ఆయా సంస్థలు పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌ నిర్వహిస్తున్న బ్యాంకు ఖాతాల నుంచి మళ్లించినట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది.

‘‘మనీలాండరింగ్‌ నిరోధక చట్టం నిబంధనలు ఉల్లంఘించినందుకు గానూ ఫైనాన్షియల్‌ యూనిట్‌ రూ.5.49 కోట్ల పెనాల్టీ విధించింది’’ అని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. ఫిబ్రవరి 15నే ఎఫ్‌ఐయూ ఉత్తర్వులు వెలువరించింది. కొత్తగా డిపాజిట్లు స్వీకరించకుండా పేమెంట్స్‌ బ్యాంక్‌పై ఆర్‌బీఐ ఇప్పటికే ఆంక్షలు విధించింది. ఆ గడువు మార్చి 15తో ముగియనుంది. ఈ క్రమంలోనే ఫైనాన్షియల్‌ యూనిట్‌ జరిమానా విధించడం గమనార్హం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని