Elon Musk: అమ్మకానికి ట్విటర్‌ పిట్ట.. సైన్‌బోర్డును వేలానికి పెట్టిన మస్క్‌

ట్విటర్‌ (ఎక్స్‌)అధినేత ఎలాన్‌ మస్క్‌ ఇప్పుడు వినూత్న నిర్ణయం తీసుకొన్నారు. గతంలో ట్విటర్‌ లోగోగా ఉన్న పిట్ట సైన్‌ను వేలం వేయడానికి సిద్ధం చేశారు.  

Published : 10 Aug 2023 15:44 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఎక్స్ (ఒకప్పటి ట్విటర్‌)లోని పాత విలువైన జ్ఞాపకాలను ఆ సంస్థ అధినేత మస్క్‌ వేలానికి పెట్టనున్నారు. దీనిలో ట్విటర్‌ ప్రధాన కార్యాలయంపై ఉన్న పిట్ట బొమ్మ సైన్‌బోర్డ్‌ కూడా  ఉండనుంది. ఎక్స్ పేరిట  ట్విటర్‌ను రీబ్రాండ్‌ చేసిన కొన్ని రోజుల్లోనే మస్క్‌ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. వేలానికి తీసుకురానున్న 584 లాట్లలో కాఫీ టేబుల్స్‌, భారీ పక్షి పంజరాలు, వైరల్‌గా మారిన ఆయిల్‌ పెయింటింగ్స్‌, డెస్క్‌లు, డీజే బూత్‌, మ్యూజికల్‌ పరికరాలు కూడా ఉన్నాయి. ఈ వేలానికి ‘‘ట్విటర్‌ రీబ్రాండింగ్‌ : ఆన్‌లైన్‌ ఆక్షన్‌ ఫీచరింగ్‌ మెమోరాబిలియా, ఆర్ట్‌, ఆఫీస్‌ అసెట్స్‌ అండ్‌ మోర్‌’’ అని పేరుపెట్టారు. 

‘కనీస బ్యాలెన్స్‌’ ఛార్జీలు.. రూ.21వేల కోట్లు

ప్రస్తుతం ట్విటర్‌ చిహ్నం ఒకటి ఇంకా శాన్‌ఫ్రాన్సిస్కోలోని స్ట్రీట్‌-10లో ట్విటర్‌ ప్రధాన కార్యాలయం పై ఉంది. దీనిని గతంలో తొలగించాలని కంపెనీ యత్నించినా.. శాన్‌ఫ్రాన్సిస్కో అధికారులు అడ్డుకొన్నారు. దీంతో ట్విటర్‌ హెడ్‌క్వార్టర్స్‌పై ఉన్న బొమ్మను ఈ వేలంలో కొనుగోలు చేసిన వ్యక్తే అధికారుల అనుమతులున్న సంస్థ సాయంతో తరలించుకోవాలని వేలం వివరాల్లో పేర్కొన్నారు.

ఇక ట్విటర్‌ వేలం వేయడానికి సిద్ధం చేసిన ఆయిల్‌ పెయింటింగ్స్‌లో ఒకటి ఎలన్‌ డిజెనెరస్‌ సెల్ఫీ కాగా.. మరొకటి బరాక్‌ ఒబామా రెండోసారి ఎన్నికల్లో గెలిచినా నాటిది. ట్విటర్‌ వేదికపై అత్యధిక లైకులు పొందిన ట్వీట్లలో ఇవి కూడా ఉన్నాయి. ఈ వేలానికి సంబంధించిన బిడ్డింగ్‌ల స్వీకరణ సెప్టెంబర్‌ 12వ తేదీ నుంచి రెండ్రోజులపాటు నిర్వహించనున్నారు. గతేడాది ట్విటర్‌ను కొనుగోలు చేసిన నాటి నుంచి ఖర్చులు తగ్గించుకొనేందుకు మస్క్‌ వేల సంఖ్యలో ఉద్యోగులను తొలగించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని