Finance Ministry: ‘కనీస బ్యాలెన్స్‌’ ఛార్జీలు.. రూ.21వేల కోట్లు

Finance Ministry: కనీస బ్యాలెన్స్ ఉంచకపోవటంతో పాటూ ఏటీఎం లావాదేవీలు, ఎస్సెమ్మెస్ సేవలకు గానూ బ్యాంకులు వసూళ్ల వివరాలను కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది.

Published : 10 Aug 2023 11:15 IST

దిల్లీ: ఖాతాల్లో కనీస బ్యాలెన్స్‌ ఉంచని వినియోగదారులపై బ్యాంకులు ఛార్జీలు విధిస్తాయి. దీంతో పాటు ఏటీఎం (ATM) లావాదేవీ ఛార్జీలు, ఎస్సెమ్మెస్ (SMS) ఛార్జీలు కూడా ఉంటాయి. ఇలా వసూలు చేసిన ఛార్జీల వివరాలను కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ రాజ్యసభలో లిఖితపూర్వకంగా తెలిపింది. ప్రభుత్వ రంగ బ్యాంకులతో పాటు ఐదు ప్రధాన ప్రైవేట్‌ బ్యాంకులు కస్టమర్ల నుంచి వసూలు చేసిన సొమ్ము వివరాలను వెల్లడించింది. 2018 నుంచి ఇప్పటి వరకు రూ.35,000 కోట్లకు పైగా ఛార్జీలు వసూలు చేసినట్లు అందులో తెలిపింది.

ప్రభుత్వ బ్యాంకులతో పాటు యాక్సిస్‌ బ్యాంక్‌ (Axis Bank), హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ (HDFC Bank), ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ (IndusInd Bank), ఐసీఐసీఐ బ్యాంక్‌ (ICICI Bank), ఐడీబీఐ బ్యాంకు (IDBI Bank) ల నుంచి కనీస బ్యాలెన్స్‌ ఉంచని కారణంగా రూ.21,000 కోట్లు వసూలు చేసినట్లు ఆర్థిక శాఖ తెలిపింది. ఏటీఎం లావాదేవీల కోసం రూ.8,000 కోట్లు, ఎస్సెమ్మెస్ సేవలు అందిస్తున్నందుకు రూ.6,000 కోట్లు సేకరించినట్లు అందులో తెలిపింది. కొన్ని రకాల ఖాతాల్లో కనీస బ్యాలెన్స్‌ ఉంచకపోతే వాటిపై బ్యాంకులు ఛార్జీలు విధిస్తాయి. అయితే, ఈ ఛార్జీలు ప్రాంతాల వారీగా మారుతుంటాయి.

కీలక వడ్డీరేట్లు యథాతథమే

నెలవారీ సగటు బ్యాలెన్స్‌ (AMB) మెట్రో నగరాల్లో రూ.3,000 నుంచి రూ.10,000 వరకు ఉంటుంది. చిన్న నగరాల్లో రూ.2,000 నుంచి రూ.5,000 వరకు, గ్రామీణ ప్రాంతాల్లో రూ.500 నుంచి రూ.1,000 వరకు ఉంటుంది. అయితే, ఈ ఛార్జీలు బ్యాంకుల బట్టి మారుతూ ఉంటాయి. అయితే, ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన (Pradhan Mantri Jan Dhan Yojna) కింద తెరిచిన ఖాతాల్లో, బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ ఖాతాలో కనీస బ్యాలెన్స్‌ ఉంచాల్సిన అవసరం లేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని