Elon Musk: ‘ఎక్స్‌’లో ఆడియో, వీడియో కాల్స్‌ ఫీచర్‌.. ఎలా యాక్టివేట్‌ చేయాలంటే..

Elon Musk: ‘ఎక్స్’ (గతంలో ట్విటర్‌)లో ఆడియో, వీడియో కాల్స్‌ ఫీచర్‌ని వినియోగదార్లకు అందుబాటులోకి తీసుకొచ్చినట్లు మస్క్‌ అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు తన ఎక్స్‌ ఖాతాలో పోస్టు చేశారు. 

Updated : 26 Oct 2023 11:45 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఎలాన్‌ మస్క్‌ (Elon Musk) ఆధ్వర్యంలోని సోషల్‌ మీడియా సంస్థ ‘ఎక్స్’ (గతంలో ట్విటర్‌)లో ఆడియో, వీడియో కాల్స్‌ ఫీచర్లను అందుబాటులోకి వచ్చాయి. ఈ విషయాన్ని మస్క్‌ తన అధికారిక ‘ఎక్స్‌’ ఖాతాలో వెల్లడించారు. అలాగే ఈ ఫీచర్ల యక్టివేషన్‌కు సంబంధించిన స్క్రీన్‌ షాట్‌ను కూడా ఆయన పంచుకున్నారు. ప్రస్తుతానికి కొందరు యూజర్లకు మాత్రమే ఈ ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి.

ప్రతి 10 సెకన్లకు ఒక 5జీ సెల్‌సైట్‌

‘ఎక్స్‌’ ప్లాట్‌ఫామ్‌ని ‘ఎవ్రీథింగ్ యాప్’ గా మార్చటంలో భాగంగానే వాయిస్, వీడియో కాల్స్‌ ఫీచర్లను తీసుకురానున్నట్లు మస్క్ ఆగస్టులోనే ప్రకటించారు. ఈ ఫీచర్‌ సాయంతో ఫోన్‌ నంబర్‌ లేకుండానే ‘ఎక్స్‌’లో కాల్స్‌ మాట్లాడవచ్చు. ఆండ్రాయిడ్‌, ఐఓఎస్‌, మ్యాక్‌, పీసీలు ఈ కాలింగ్‌ ఫీచర్‌ సపోర్ట్‌ చేస్తాయి. అయితే దీన్ని యాక్టివేట్‌ చేసుకోవాలంటే ‘Settings’లోకి వెళ్లి ‘Privacy & Safety’ ఆప్షన్‌పై క్లిక్‌ చేసి‘Direct Messages’ ఆప్షన్‌ను ఎంచుకొని  ‘Enable Audio & Video Calling’ ఫీచర్‌ని ఎనేబల్‌ చేసుకోవాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు