Elon Musk: ఎక్స్‌లో ప్రత్యర్థుల కట్టడికి మస్క్‌ యత్నం..!

ఎక్స్ (ట్విటర్‌)కు పోటీ ఇచ్చే సోషల్‌ మీడియా సంస్థలను కట్టడి చేసేందుకు మస్క్‌ సైలెంట్‌గా ఓ యత్నం చేసినట్లు తెలుస్తోంది. తమ వేదికపై షేర్‌ చేసిన ఆయా సంస్థల లింకులు ఆలస్యంగా ఓపెన్‌ అయ్యేట్లు మార్పులు చేసినట్లు ఓ టెక్‌ సంస్థ గుర్తించింది.

Updated : 16 Aug 2023 13:34 IST

ఇంటర్నెట్‌డెస్క్‌:  ప్రముఖ సోషల్‌ మీడియా కంపెనీ ఎక్స్‌ (ట్విటర్‌) వేదికపై ప్రత్యర్థులను కట్టడి చేసేందుకు దాని యజమాని ఎలాన్‌ మస్క్‌ యత్నాలు చేస్తున్నారు. బ్లూస్కై, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ వంటి సోషల్‌ మీడియా కంపెనీలతోపాటు.. న్యూయార్క్‌టైమ్స్‌ వంటి ప్రత్యర్థి కంపెనీల లింక్‌లు 5 సెకన్లు ఆలస్యంగా ఓపెన్‌ అయ్యేట్లు మార్పులు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు వాషింగ్టన్‌ పోస్టు పత్రిక ఓ కథనం వెలువరించింది. వీటికి సంబంధించిన లింక్‌లను ఎక్స్‌ వేదికగా షేర్‌ చేస్తే.. వాటిని క్లిక్‌ చేసిన వారికి వెబ్‌పేజీ పూర్తిగా లోడ్‌ అవ్వడానికి ఐదు సెకన్ల జాప్యం చోటు చేసుకుంటోందని పేర్కొంది. ‘హ్యాకర్‌ న్యూస్‌’ అనే టెక్‌ సంస్థ తొలుత మంగళవారం జాప్యం విషయాన్ని వెల్లడించింది. ఆగస్టు 4వ తేదీన ఓ వార్త సంస్థ లింక్‌ ఓపెన్‌ కావడంలో జాప్యాన్ని తాము గుర్తించినట్లు పేర్కొంది.

కేజ్‌ ఫైట్ అంతా ఉత్తిదేనా..? మస్క్‌ ఏం చెప్పారంటే..?

ఈ విషయంపై కొన్ని వార్తా సంస్థలు ఎక్స్‌(ట్విటర్‌)ను వివరణ కోరినట్లు పేర్కొంది. ఆ తర్వాత మంగళవారం రాత్రికి మళ్లీ సాధారణ స్థాయికి వచ్చిందని సదరు పత్రిక తెలిపింది. జాప్యాన్ని తొలగించామని ఎక్స్‌ వెల్లడించింది. అంతకు మించి ఎటువంటి వివరణ ఇవ్వలేదు.

బిలియనీర్‌ ఎలన్‌ మస్క్‌ గతేడాది అక్టోబర్‌లో ట్విటర్‌ను కొనుగోలు చేశారు. అంతకు ముందు నుంచే ఆయన తన కంపెనీలైన టెస్లా, స్పేస్‌ఎక్స్‌ విషయంలో ప్రతికూలంగా ఉన్న మీడియా సంస్థలపై గుర్రుగా ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని