Cage Fight: కేజ్‌ ఫైట్ అంతా ఉత్తిదేనా..? మస్క్‌ ఏం చెప్పారంటే..?

టెక్ దిగ్గజాలు ఎలాన్‌ మస్క్‌(Elon Musk), మార్క్‌ జుకర్ బర్గ్(Mark Zukerberg) మధ్య కేజ్ ఫైట్ ఉంటుందా..? ఉండదా..? తాజాగా దీనిపై మస్క్‌ చేసిన పోస్టు ఆసక్తికరంగా మారింది. 

Updated : 16 Aug 2023 16:59 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఇటీవల కాలంలో కేజ్‌ఫైట్ పదం తెగ వైరలవుతోంది. టెక్‌ దిగ్గజాలు ఎలాన్‌ మస్క్ (Elon Musk), మార్క్‌ జుకర్‌బర్గ్‌ (Mark Zukerberg) మధ్య దానిపై మాటల యుద్ధం జరుగుతుండటమే అందుకు కారణం. ఇంతకాలం ఈ ఫైట్ నిజంగా జరుగుతుందనేలా వారి మాటలు ఉన్నాయి. కానీ ఇప్పుడు అదంతా ఉత్తిదేనా అన్న సందేహం కలుగుతోంది. తాజాగా మస్క్‌ చేసిన ట్వీట్‌ చూస్తుంటే దీనికి బలం చేకూరుతోంది. ఫైట్ రీకాప్ అంటూ ఇప్పటివరకూ జరిగిన తతంగాన్ని ఎక్స్‌ (గతంలో ట్విటర్‌)లో పోస్టు చేశారు. 

‘నేను ఫైట్‌ గురించి జుకర్‌బర్గ్‌తో జోక్‌ చేశాను. లొకేషన్ పంపమంటూ జుక్‌ నుంచి సమాధానం వచ్చింది. మా పోటీ కోసం వేదిక ఇచ్చేందుకు ఇటలీ ముందుకు వచ్చింది. కానీ జుక్‌ దానిని తిరస్కరించారు. అప్పుడు దీనికి వేదికగా జుకర్ బర్గ్‌ ఇంటినే నేను సూచించాను. దురదృష్టవశాత్తూ ఆయన ఇంట్లో లేరు. అసలు ఆయనకు పోరాడే ఉద్దేశం ఉందా..?’అని ఇప్పటివరకు జరిగిన తతంగాన్నంతా వివరించారు.

కొన్నేళ్లుగా రాజకీయాలు, కృత్రిమ మేధ( AI)కు సంబంధించి పలు విషయాల్లో భిన్నాభిప్రాయలు వ్యక్తం చేస్తూ.. మస్క్‌, జుకర్‌బర్గ్‌ పరస్పరం విమర్శలు చేసుకుంటున్నారు. గత నెలలో ఇవి తారస్థాయికి చేరాయి. ఎక్స్‌ (Twitter)కు పోటీగా మెటా సంస్థ థ్రెడ్స్‌ అనే యాప్‌ను తీసుకొచ్చింది. దీనిపై మస్క్ ఆరోపణలు చేశారు. ఎక్స్‌ను కాపీ కొట్టి థ్రెడ్స్‌ను డిజైన్‌ చేశారని పేర్కొన్నారు.

2047 నాటికి ₹15 లక్షలకు తలసరి ఆదాయం: ఎస్‌బీఐ రీసెర్చ్‌

ఈ క్రమంలోనే జుకర్‌బర్గ్ రెడీ అంటే అతడితో కేజ్‌ ఫైట్‌కు తాను సిద్ధమని తొలుత మస్క్‌ ఎక్స్‌లో పేర్కొన్నారు. దీనిపై జుకర్‌బర్గ్‌ స్పందిస్తూ ‘ప్లేస్‌ ఎక్కడో చెప్పు’ అంటూ సవాల్‌కు సై అన్నారు. తొలుత ఇదంతా ప్రచారం కోసమేనని నెటిజన్లు భావించినా.. వీరిద్దరూ ట్రైనింగ్ సెషన్‌లో పాల్గొనడంతో దీనిపై ఆసక్తి పెరిగింది. తర్వాత పరిణామాలు వారి పోటీ ఖాయమనేలా కనిపించాయి. ఫైట్‌ కోసం ప్రాక్టీస్‌ చేసిన దృశ్యాలను వారు పోస్టు చేశారు. 

ఈ క్రమంలోనే ఫైట్ కోసం మస్క్‌ డేట్లు ఇవ్వడం లేదని జుకర్ బర్గ్ ఆరోపించారు. దాంతో కేజ్‌ ఫైట్‌ గురించి మస్క్‌ మరోసారి పోస్టు చేశారు. తన టెస్లా కారును (ఆటోపైలట్‌) జుకర్‌బర్గ్‌ ఇంటికి డ్రైవ్‌ చేయాలని అడుగుతానని.. మెటా సీఈవో ఇంట్లో ఉంటే అక్కడే ఫైట్‌ చేస్తానని ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని