Xiaomi HyperOS: షావోమీ యూజర్లా.. హైపర్‌ ఓఎస్‌ మీ ఫోన్లకు ఎప్పుడంటే?

Xiaomi HyperOS: భారత్‌లో హైపర్‌ ఓఎస్‌ను షావోమీ విడుదల చేసింది. 26 డివైజులకు అప్‌డేట్‌ ద్వారా ఈ యూజర్‌ ఇంటర్‌ఫేస్‌ అందుబాటులోకి రానుంది. 

Published : 01 Mar 2024 16:33 IST

Xiaomi HyperOS | ఇంటర్నెట్‌ డెస్క్‌: షావోమీ (Xiaomi) ఫోన్లు వాడే వారందరికీ ఎంఐయూఐ(MIUI) సుపరిచితమే. దీని స్థానంలో హైపర్‌ ఓఎస్‌ (HyperOS) పేరిట కొత్త యూజర్‌ ఇంటర్‌ ఫేస్‌ను కంపెనీ ఇదివరకే ప్రకటించింది. గతేడాది అక్టోబర్‌లో చైనాలో ఈ కొత్త యూఐని రిలీజ్ చేసిన షావోమీ.. తాజాగా భారత్‌లోనూ పరిచయం చేసింది. ఏయే డివైజులకు ఎప్పుడు అందుబాటులోకి వచ్చేదీ వెల్లడించింది.

‘సూర్యఘర్‌’కు దరఖాస్తు ఎలా? ₹78 వేల రాయితీ ఎలా పొందాలి?

ఎంఐయూఐతో పోలిస్తే మరింత మెరుగైన పనితీరుతో హైపర్‌ ఓఎస్‌ (HyperOS) వస్తోందని కంపెనీ చెబుతోంది. గ్యాలరీలో ఏఐ ఫీచర్లు, కొత్త కలర్‌ సిస్టమ్‌, కొత్త డిజైన్‌తో కూడిన ఐకాన్స్‌, హైపర్‌ కనెక్ట్‌ వంటి సదుపాయాలతో ఈ ఓఎస్‌ వస్తోంది. ఎంఐయూఐతో పోలిస్తే తక్కువ స్టోరేజీ దీనికి సరిపోతుందని పేర్కొంది. దీనివల్ల డివైజుల ప్రొడక్టవిటీ పెరుగుతుందని చెబుతోంది. అప్‌డేట్‌ రూపంలో ఈ ఓఎస్‌ను పొందొచ్చు.

  • తొలుత షావోమీ 13 ప్రో, షావోమీ ప్యాడ్‌ 6, రెడ్‌మీ 12 5జీ, రెడ్‌మీ 12సీ, రెడ్‌మీ 11 ప్రైమ్‌, రెడ్‌మీ ప్యాడ్‌ డివైజులకు హైపర్‌ ఓఎస్‌ను షావోమీ విడుదల చేసింది. మార్చి 7న విడుదలయ్యే షావోమీ 14.. ఔటాఫ్‌ది బాక్స్‌ హైప్‌ ఓఎస్‌తోనే రానుంది.
  • షావోమీ 12 ప్రో, రెడ్‌మీ నోట్ 12 5జీ, రెడ్‌మీ నోట్‌ 12 ప్రో 5జీ, రెడ్‌మీ నోట్‌ 12 ప్రో+ 5జీ, రెడ్‌మీ నోట్‌ 13 5జీ, రెడ్‌మీ నోట్‌ 13 ప్రో 5జీ, రెడ్‌మీ నోట్‌ 13 ప్రో+ 5జీ ఫోన్లకు మార్చి నెలలోనే హైపర్‌ ఓఎస్‌ అందుబాటులోకి రానుంది.
  • షావోమీ 11 అల్ట్రా, షావోమీ 11టీ ప్రో, ఎంఐ 11 ఎక్స్‌, షావోమీ 11ఐ హైపర్‌ ఛార్జ్‌, షావోమీ 11 లైట్‌, షావోమీ 11ఐ, ఎంఐ 10, షావోమీ ప్యాడ్‌ 5, రెడ్‌మీ కె50ఐ, రెడ్‌మీ 13 సి సిరీస్‌, రెడ్‌మీ 12, రెడ్‌మీ 11 ప్రైమ్‌ 5జీ, రెడ్‌మీ నోట్‌ 11 సిరీస్‌ ఫోన్లకు ఈ ఏడాది రెండో త్రైమాసికం (ఏప్రిల్‌-జూన్‌)లో హైపర్‌ ఓఎస్‌ అప్‌డేట్‌ విడుదల కానుంది.
  • మొత్తం 26 డివైజులకు హైపర్‌ ఓఎస్‌ కంపెనీ రిలీజ్‌ చేస్తోంది. వీటిలో 2020లో లాంచ్‌ అయిన షావోమీ 11 అల్ట్రా, ఎంఐ 10 వంటి పాత డివైజులు సైతం ఉన్నాయి.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని