Flipkart Jobs: పండగ సేల్స్‌కు ఫ్లిప్‌కార్ట్‌ రెడీ.. ఈ సీజన్‌లో లక్ష ఉద్యోగాలు!

Flipkart aims to create over 1 lakh seasonal jobs: ఈ పండగల సీజన్‌లో లక్ష ఉద్యోగాలను సృష్టించనున్నామని ఫ్లిప్‌కార్ట్‌ తెలిపింది. డెలివరీ హబ్స్‌, ఫుల్‌ఫిల్‌మెంట్‌ సెంటర్లలో ఈ ఉద్యోగాలు ఉండనున్నాయి.

Published : 04 Sep 2023 17:09 IST

ముంబయి: దేశీయ ఇ-కామర్స్‌ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ (Flipkart) పండగల సీజన్‌కు సిద్ధమైంది. ఈ సారి లక్ష సీజనల్‌ ఉద్యోగాలు సృష్టించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కంపెనీ తెలిపింది. పండగల సీజన్‌లో ఉండే డిమాండ్‌కు అనుగుణంగా సప్లయ్‌ చైన్‌ను తీర్చిదిద్దనున్నామని, అందులోభాగంగా ప్రత్యక్షంగా, పరోక్షంగా ఈ ఉపాధి అవకాశాలు లభిస్తాయని కంపెనీ పేర్కొంది. మహిళలు, దివ్యాంగులకు సైతం ఉపాధి కల్పిస్తామని ఓ ప్రకటనలో తెలిపింది. త్వరలో పండగల సీజన్ ప్రారంభం కానున్నవేళ ఫ్లిప్‌కార్ట్‌ ఈ ప్రకటన చేసింది. ఫుల్‌ఫిల్‌మెంట్‌ సెంటర్లు, సార్టేషన్‌ సెటర్లు, డెలివరీ హబ్స్‌లో ఈ ఉద్యోగాలు లభించనున్నాయి.

క్రెటా, గ్రాండ్‌ విటారాకు పోటీ హోండా ఎలివేట్‌.. ధర, ఫీచర్లు ఇవే..!

‘ది బిగ్‌ బిలియన్‌ డేస్‌’ (The Big Billion Days) పేరిట ఏటా ఫ్లిప్‌కార్ట్‌ అతిపెద్ద సేల్‌ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో ప్రధాన కంపెనీల ఉత్పత్తులపై డిస్కౌంట్లు అందిస్తారు. దేశీయంగా నిర్వహించే అతిపెద్ద సేల్స్‌లో ఇదీ ఒకటి. ఈ సేల్‌లో లక్షలాది మంది కొత్త కస్టమర్లు ఇ-కామర్స్‌ను వినియోగిస్తారని ఈ సందర్భంగా ఫ్లిప్‌కార్ట్‌ గ్రూప్‌ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌, సప్లయ్‌ చైన్‌ హెడ్‌  హేమంత్‌ బద్రి తెలిపారు. ఈ సేల్‌ను దృష్టిలో పెట్టుకుని కెపాసిటీ, స్టోరేజీ, మానవ వనరులు, డెలివరీ విభాగాలను పటిష్ఠం చేస్తున్నామని తెలిపారు. ఫ్లిప్‌కార్ట్‌తో పాటు అమెజాన్‌ సైతం గ్రేట్‌ ఇండియన్‌ సేల్ పేరిట ఏటా సేల్స్‌ నిర్వహిస్తూ ఉంటుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని