Flipkart Big Diwali: ‘బిగ్‌ దీపావళి సేల్‌’కు సిద్ధమైన ఫ్లిప్‌కార్ట్‌.. ఎప్పటి నుంచంటే?

Flipkart Big Diwali: ప్రముఖ ఇ-కామర్స్‌ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌  ‘బిగ్ దీపావళి సేల్‌’కు సిద్ధమైంది. నవంబర్‌ 2 నుంచి ఈ సేల్‌ నిర్వహించనున్నట్లు ప్రకటించింది.

Published : 30 Oct 2023 02:16 IST

Flipkart Big Diwali Sale 2023 | ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ ఇ-కామర్స్‌ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ (flipkart) మరోసేల్‌కు సిద్ధమైంది.  ఇటీవల దసరా సందర్భంగా ‘బిగ్‌ దసరా సేల్‌’ను నిర్వహించిన సంస్థ.. దీపావళి సందర్భంగా ‘బిగ్ దీపావళి’ సేల్‌ను తీసుకురానున్నట్లు ప్రకటించింది. నవంబర్‌ 2 నుంచి నవంబర్‌ 11 వరకు పది రోజుల పాటూ ఈ సేల్‌ జరగనుంది.

ప్రపంచవ్యాప్తంగా జియోను విస్తరించే ఆలోచనలున్నాయ్‌: కంపెనీ అధ్యక్షుడు

బిగ్‌ దీపావళి సేల్‌లో భాగంగా ఎస్‌బీఐ కార్డు హోల్డర్లకు 10 శాతం ఇన్‌స్టంట్‌ డిస్కౌంట్ అందించనున్నట్లు ఫ్లిప్‌కార్ట్‌ తెలిపింది. ఫ్లిప్‌కార్ట్‌ యాక్సిస్‌ బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డులపై 5 శాతం క్యాష్‌బ్యాక్‌ అందించనుంది. పేటీఎం యూపీఐ, వ్యాలెట్‌ లావాదేవీలపై కూడా తగ్గింపు ఇవ్వనున్నట్లు తెలిపింది. ఫ్లిప్‌కార్ట్‌ పే లేటర్‌ ఆప్షన్‌ ద్వారా లక్ష రూపాయల వరకు కొనుగోలు చేయొచ్చని, వీటిపై నో కాస్ట్‌ ఈఎంఐ సదుపాయం ఇవ్వనున్నట్లు ఫ్లిప్‌కార్ట్‌ ప్రకటించింది. ఇక ఆఫర్ల విషయానికొస్తే.. స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌ట్యాప్‌లపై  45 శాతం వరకు డిస్కౌంట్‌ అందించనున్నట్లు సమాచారం. అలాగే స్మార్ట్‌వాచ్‌, దుస్తులపై ఏకంగా 80 శాతం ఆఫర్లు అందించనుంది. సూపర్‌ కాయిన్ల ద్వారా అదనపు డిస్కౌంట్‌ పొందొచ్చని ఫ్లిప్‌కార్ట్‌ పేర్కొంది.  బిగ్‌ దసరా సేల్‌లో ఆఫర్లు మిస్‌ అయిన వారు ఈ సేల్‌లో పాల్గొనొచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని