Flipkart: బిగ్‌ సేవింగ్‌ డేస్‌ సేల్‌కు సిద్ధమైన ఫ్లిప్‌కార్ట్‌.. ఎప్పటినుంచంటే?

Flipkart: ఫ్లిప్‌కార్ట్‌ బిగ్‌ సేవింగ్‌ డేస్‌ సేల్‌ తేదీలను ప్రకటించింది. మే 3 నుంచి 9 వరకు ఈ సేల్‌ అందుబాటులో ఉండనుంది.

Published : 27 Apr 2024 00:03 IST

Flipkart | ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రముఖ ఈ-కామర్స్‌ ప్లాట్‌ఫామ్‌ ఫ్లిప్‌కార్ట్‌ (Flipkart) బిగ్‌ సేవింగ్ డేస్‌ సేల్‌ (Big Saving Days) తేదీలను తాజాగా ప్రకటించింది. మే 3 నుంచి 9 వరకు ఈ సేల్‌ కొనసాగనుంది. సేల్‌లో భాగంగా స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తులు, గృహోపకరణాలపై డిస్కౌంట్లు లభించనున్నాయి. ఫ్లిప్‌కార్ట్‌ ప్లస్‌ మెంబర్‌షిప్‌ యూజర్లు ఒకరోజు ముందుగానే అంటే మే 2 నుంచే ఈ సేల్‌లో పాల్గొనవచ్చని ప్రకటించింది.

ఐపీఓకు స్విగ్గీ రెడీ.. సెబీ రహస్య మార్గంలో దరఖాస్తు

బిగ్‌ సేవింగ్ డేస్‌ సేల్లో భాగంగా ఎస్‌బీఐ కార్డు ద్వారా చేసే కొనుగోళ్లపై 10 శాతం ఇన్‌స్టంట్‌ డిస్కౌంట్ అందించనున్నట్లు ఫ్లిప్‌కార్ట్‌ తన వెబ్‌సైట్లో పేర్కొంది. ఫ్లిప్‌కార్ట్‌ పే లేటర్‌ ఆప్షన్‌ ద్వారా లక్ష రూపాయల వరకు కొనుగోలు చేయొచ్చని, వీటిపై నో కాస్ట్‌ ఈఎంఐ సదుపాయం ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఫ్లిప్‌కార్ట్‌ యాక్సిస్‌ బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డులపై 5 శాతం క్యాష్‌బ్యాక్‌ అందించనుంది. యూపీఐ లావాదేవీలపై కూడా తగ్గింపు ఇవ్వనున్నట్లు తెలిపింది. అయితే కంపెనీ ఆఫర్లను ఇంకా రివీల్‌ చేయలేదు. కొత్తగా మార్కెట్‌లోకి వచ్చిన స్మార్ట్‌ఫోన్లపై భారీ ఎత్తున డిస్కౌంట్లు అందిచనున్నట్లు తెలుస్తోంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని