Swiggy IPO: ఐపీఓకు స్విగ్గీ రెడీ.. సెబీ రహస్య మార్గంలో దరఖాస్తు

ఫుడ్‌ డెలివరీ సంస్థ స్విగ్గీ ఐపీఓకు సిద్ధమైంది. ఇందుకోసం సెబీకి తాజాగా ముసాయిదా పత్రాలను సమర్పించింది.

Published : 26 Apr 2024 13:46 IST

Swiggy IPO | దిల్లీ: ఫుడ్ డెలివరీ స్టార్టప్‌ స్విగ్గీ (Swiggy) ఐపీఓకు సిద్ధమైంది. ఇప్పటికే వాటాదారుల నుంచి అనుమతి పొందిన ఆ సంస్థ.. తాజాగా  సెబీకి (SEBI) పబ్లిక్‌ ఆఫర్‌కు సంబంధించిన ముసాయిదా పత్రాలు సమర్పించినట్లు తెలిసింది. ఇందుకోసం కాన్ఫిడెన్షియల్‌ మార్గాన్ని స్విగ్గీ ఎంచుకుంది. అంటే కంపెనీ వెల్లడించేంత వరకు ఐపీఓకు సంబంధించిన వివరాలేవీ ప్రజలకు అందుబాటులో ఉండవు.

సాధారణంగా ఏదైనా సంస్థ ఐపీఓ కోసం ముసాయిదా పత్రాలతో సెబీకి దరఖాస్తు చేసుకుంటే ప్రజలకు ఆ వివరాలు అందుబాటులోకి వస్తాయి. ఒకసారి ఐపీఓకు సెబీ ఆమోదం తెలిపిన తర్వాత 12 నెలల వరకు అది చెల్లుబాటు అవుతుంది. అయితే, 2022 నవంబర్‌లో తొలిసారి కాన్ఫిడెన్షియల్‌ మార్గాన్ని సెబీ తీసుకొచ్చింది. ఈ మార్గంలో అందిన దరఖాస్తులను సెబీ పరిశీలించి ఆమోదం తెలుపుతుంది. ఒకసారి ఆమోదం పొందాక 18 నెలల పాటు చెల్లుబాటవుతుంది.

17 వేల ఐసీఐసీఐ క్రెడిట్‌ కార్డులు బ్లాక్‌.. కారణమిదే!

గతంలో టాటా గ్రూప్‌నకు చెందిన టాటా ప్లే ఈ మార్గంలో తొలిసారి ముసాయిదా పత్రాలను సెబీకి సమర్పించింది. స్టార్టప్‌ సంస్థ అయిన ఓయో కూడా ఇదే మార్గంలో దరఖాస్తు చేసుకుంది. తాజాగా స్విగ్గీ కూడా అదే బాటలో పయనిస్తుండడం గమనార్హం. ఈ ఐపీఓ ద్వారా రూ.10,400 కోట్ల వరకు సమీకరించాలని స్విగ్గీ భావిస్తోంది. ఇందులో రూ.3750 కోట్లు తాజా షేర్ల జారీ ద్వారా, రూ.6,664 కోట్లు ఆఫర్‌ సేల్‌ పద్ధతిన విక్రయించనున్నారు. యాంకర్‌ ఇన్వెస్టర్ల నుంచి రూ.750 కోట్లు సమీకరించాలని చూస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని