Flipkart: బుక్‌ చేసిన రోజే ఆర్డర్‌ డెలివరీ.. ఫ్లిప్‌కార్ట్‌ కొత్త ప్రయోగం

Flipkart Same Day Delivery: ‘సేమ్ డే డెలివరీ’ పేరుతో ఫ్లిప్‌కార్ట్‌ కొత్త డెలివరీ సర్వీసులను ప్రారంభిస్తోంది. ఆర్డర్‌ చేసిన వస్తువులను బుక్‌ చేసిన రోజే కస్టమర్లకు అందించనుంది.

Published : 01 Feb 2024 16:19 IST

Flipkart same day delivery feature| ఇంటర్నెట్‌ డెస్క్‌: వాల్‌మార్ట్‌ నేతృత్వంలోని ఈ - కామర్స్‌ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌ (Flipkart) కస్టమర్ల కోసం కొత్త సర్వీస్ ప్రారంభిస్తోంది. తన ప్లాట్‌ఫామ్‌లో ఆర్డర్‌ చేసే వస్తువులను బుక్‌ చేసిన రోజే డెలివరీ చేసేందుకు సిద్ధమైంది. దేశంలో ఎంపిక చేసిన 20 నగరాల్లో ప్రయోగాత్మకంగా ఈ సేవలు ప్రారంభించనుంది. 

తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్‌, విజయవాడతో పాటు అహ్మదాబాద్‌, బెంగళూరు, భువనేశ్వర్‌, కోయంబత్తూరు, చెన్నై, దిల్లీ, గువాహటి, ఇందౌర్‌, జైపుర్‌, కోల్‌కతా, లఖ్‌నవూ, లుథియానా, ముంబయి, నాగ్‌పూర్‌, పుణె, పట్నా, రాయ్‌పుర్‌, సిలిగురి నగరాల్లో ఈ సేవల్ని ప్రారంభించనుంది. త్వరలోనే ఈ కొత్త సదుపాయం ప్రయోగాత్మకంగా అమలు చేస్తామని ఫ్లిప్‌కార్ట్‌ పేర్కొంది. అయితే కచ్చితమైన తేదీని వెల్లడించలేదు. రానున్న నెలల్లో దేశంలోని మరిన్ని నగరాలకు ఈ సేవలను తీసుకురావాలని యోచిస్తున్నట్లు తెలిపింది. 

వ్యవ‘సాయం’ @ రూ.1.27 లక్షల కోట్లు.. నానో డీఏపీ విస్తరణ.. సమీకృత ఆక్వా పార్క్‌లు

ఒంటి గంట లోపు...

మొబైల్స్, ఫ్యాషన్‌, బ్యూటీ, లైఫ్‌ స్టైల్‌, బుక్స్‌, గృహోపకరణాలు, ఎలక్ట్రానిక్‌ విభాగాలకు చెందిన వస్తువులను బుక్‌ చేసిన రోజే కస్టమర్లకు అందించాలనేది ఫ్లిప్‌కార్ట్‌ ఆలోచన. అయితే ఈ సదుపాయం పొందాలంటే మధ్యాహ్నం ఒంటి గంట లోపే వస్తువులను ఆర్డర్‌ చేయాల్సి ఉంటుంది. అప్పుడు అదే రోజు అర్ధరాత్రి 12 గంటలలోపు వస్తువులు డెలివరీ చేస్తారు. ఇక మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత బుక్ చేసినట్లయితే మరుసటి రోజు డెలివరీ అందుతుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని