Seat belt: బస్సులు, భారీ వాహనాల్లోనూ సీట్‌ బెల్ట్‌ తప్పనిసరి చేయండి!

Seat belt: పాఠశాల బస్సులు, భారీ వాహనాల్లో ఇకపై సీటు బెల్ట్‌ వినియోగాన్ని తప్పనిసరి చేయాలని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖను ఐఆర్‌ఎఫ్‌ కోరింది.

Updated : 24 Feb 2024 20:31 IST

Seat belt| దిల్లీ: బస్సులు సహా అన్ని భారీ వాహనాల్లో సీటు బెల్ట్‌ వినియోగాన్ని తప్పనిసరి చేయాలని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వశాఖ (MoRTH)ను అంతర్జాతీయ రహదారి సమాఖ్య (IRF) కోరింది. రోడ్డు ప్రమాదాలు తగ్గించడానికి ఈ నిర్ణయం ఉపకరిస్తుందని పేర్కొంది. ఈ మేరకు ఆ శాఖకు ఓ లేఖ రాసింది. 

‘బస్సు ప్రమాదాల వల్ల ఎంతోమంది అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. సీటు బెల్ట్‌ ఉంటే వారిలో చాలామంది ప్రమాదం నుంచి బయటపడేవారు. బస్సుల్లోనూ సీట్‌ బెల్ట్‌ ఉండాలి. వాటి వినియోగాన్ని తప్పనిసరి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది’ అని కేంద్ర రవాణాశాఖకు రాసిన లేఖలో ఐఆర్‌ఎఫ్‌ ప్రెసిడెంట్‌ కపిల కోరారు. 

జీమెయిల్‌ మూసివేస్తారంటూ ప్రచారం.. గూగుల్‌ క్లారిటీ

నేషనల్ హైవే ట్రాఫిక్ సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్ 2021 నివేదిక ప్రకారం.. అమెరికాలో బస్సు ప్రమాదాల కారణంగా కేవలం 14 మంది మాత్రమే ప్రాణాలు కోల్పోయారు. చైనా (2022)లో బస్సు ప్రమాదాల్లో 215 మరణించారు. ప్రజా రవాణా విషయంలో ఆయా దేశాలు అవలంబిస్తున్న విధానాలే దీనికి కారణమని కపిల పేర్కొన్నారు. కఠినమైన భద్రతా ప్రమాణాలను పాటిస్తూ అభివృద్ధి చెందుతున్న, అభివృద్ధి చెందిన దేశాలు అద్భుతమైన ఫలితాలను సాధించాయని తెలిపారు. భారత్‌లో బస్సుల్లో ఈతరహా ప్రమాణాలను సరిగ్గా పాటించకపోవడంతో పాఠశాలకు వెళ్లే పిల్లలు, అమాయకుల జీవితాలు ప్రమాదంలో పడుతున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు