Google Playstore: ఆ 13 యాప్‌లను తొలగించండి.. ఆండ్రాయిడ్‌ యూజర్లకు గూగుల్ సూచన

ఆండ్రాయిడ్ యూజర్లకు గూగుల్ కీలక సూచన చేసింది. మాల్‌వేర్‌ వ్యాప్తి చేస్తున్న 13 యాప్‌లను ప్లేస్టోర్‌ నుంచి తొలగించింది. 

Updated : 01 Jan 2024 15:39 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: డిజిటల్‌ ప్రపంచంలో డేటా భద్రత ఎంతో ముఖ్యం. యూజర్లు అప్రమత్తంగా లేకుంటే.. ఆఫర్లు, ప్రకటనలు, థర్డ్‌పార్టీ యాప్‌ల పేరుతో సైబర్‌ నేరగాళ్లు వ్యక్తిగత వివరాలను చోరీ చేసి బ్యాంకు ఖాతాలను ఖాళీ చేసేస్తారు. యూజర్ల భద్రత కోసం గూగుల్ (Google) ఎప్పటికప్పుడు మాల్‌వేర్‌ యాప్‌లను ప్లేస్టోర్‌ (Play Store) నుంచి తొలగిస్తుంది. తాజాగా సైబర్‌ సెక్యూరిటీ సంస్థ మెకాఫే (McAfee) నివేదిక ఆధారంగా 13 యాప్‌లను ప్లేస్టోర్‌ నుంచి తొలగించింది. యూజర్లు వెంటనే ఈ యాప్‌లను తమ ఫోన్‌ల నుంచి డిలీట్ చేయాలని సూచించింది.

ఈ 13 యాప్‌లలో హెల్త్‌, గేమింగ్‌, రాశి ఫలాలు, ప్రొడక్టివిటీకి సంబంధించినవి ఉన్నట్లు గూగుల్‌ తెలిపింది. ఈ యాప్‌లను యూజర్లు తమ ఫోన్‌లలో ఇన్‌స్టాల్ చేసిన తర్వాత సోషల్‌ ఇంజినీరింగ్ సాయంతో వారి ప్రమేయం లేకుండా డివైజ్‌ను యాక్సెస్‌ చేసుకుని, ఆండ్రాయిడ్ చేసే అన్ని రకాల అలర్ట్‌ మెసేజ్‌లను డిజేబుల్ చేస్తాయి. తర్వాత సైబర్‌ నేరగాళ్లు ఫోన్‌లను తమ ఆధీనంలోకి తీసుకుని.. ప్రకటనలపై క్లిక్‌ చేయడం, మోసపూరిత ఆర్థిక లావాదేవీలను నిర్వహించే యాప్‌లను ఇన్‌స్టాల్ చేయడం ద్వారా లబ్ధి పొందుతున్నట్లు మెకాఫే తెలిపింది. వీటివల్ల యూజర్ల వ్యక్తిగత, బ్యాంకింగ్‌ సమాచారం ఇతరుల చేతికి చేరే అవకాశం ఉందని వెల్లడించింది. దీంతో ఈ యాప్‌లను వెంటనే ప్లేస్టోర్‌ నుంచి తొలగిస్తున్నట్లు గూగుల్ ప్రకటించింది. యూజర్లు ఎవరైనా ఈ యాప్‌లను ఇన్‌స్టాల్‌ చేసుకుని ఉంటే డిలీట్‌ చేయాలని సూచించింది. ఆ 13 యాప్‌ల వివరాలివే..

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని