Google gemini: మోదీపై జెమిని సమాధానం.. సారీ చెప్పిన గూగుల్‌

Google gemini: తన ఏఐ ప్లాట్‌ఫామ్‌ జెమిని ఇచ్చిన సమాధానంపై భారత్‌కు గూగుల్‌ క్షమాపణ చెప్పింది.

Published : 04 Mar 2024 13:42 IST

Google gemin | ఇంటర్నెట్‌ డెస్క్: ప్రధాని నరేంద్రమోదీ (PM Modi) గురించి గూగుల్‌కు చెందిన ఏఐ ప్లాట్‌ఫామ్‌ జెమిని (Gemini AI) ఇచ్చిన సమాధానం వివాదానికి దారి తీసింది. దీనిపై తాజాగా గూగుల్‌ (Google) క్షమాపణ చెప్పింది. అంతేకాకుండా తమ ప్లాట్‌ఫామ్‌ను ‘నమ్మదగినది కాదు’ అని పేర్కొంది. ఐటీ, ఎలక్ట్రానిక్స్ సహాయ మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌ ఓ ఆంగ్ల పత్రికకు తెలియజేశారు.

గూగుల్ ప్రారంభించిన జెమిని పక్షపాత ధోరణితో వ్యవహరిస్తోందంటూ ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా ప్రధాని మోదీ, ట్రంప్‌, జెలెన్‌ స్కీ విషయంలో ఒకే తరహా ప్రశ్నకు.. వేర్వేరుగా సమాధానం ఇచ్చింది. మోదీ విషయంలో ఒక రకంగా సమాధానం ఇచ్చిన జెమిని.. మిగిలిన ఇద్దరి విషయంలో సమాధానం దాటవేసింది. దీంతో ఈ వ్యవహారం సోషల్‌మీడియాలో వైరల్‌ అవ్వడంతో కేంద్రం తీవ్రంగా స్పందించింది. గూగుల్‌కు నోటీసులిచ్చింది. దీనిపై గూగుల్‌ తన స్పందనగా క్షమాపణలు చెప్తూ.. తమ ప్లాట్‌ఫామ్‌ను నమ్మదగినది కాదని పేర్కొందని రాజీవ్‌ చంద్రశేఖర్‌ చెప్పారు.

అనంత్‌-రాధిక హస్తాక్షర్‌.. ఆకట్టుకున్న నీతా నాట్యం

మరోవైపు దేశంలో పరీక్షల దశలో, శిక్షణలో ఉన్న ఏఐ ఉత్పత్తులను లాంఛ్‌ చేయాలంటే సంబంధిత ఏఐ ప్లాట్‌ఫామ్స్‌ ముందస్తు అనుమతి తీసుకోవాలంటూ కేంద్రం అడ్వైజరీ జారీ చేసింది. దీనిపై గందరగోళం నెలకొంది. దీనిపై రాజీవ్‌ చంద్రశేఖర్‌ స్పష్టతనిచ్చారు. ఈ విషయంలో స్టార్టప్‌లకు మినహాయింపు ఇచ్చారు. కేవలం బిగ్‌ టెక్‌ కంపెనీలకే ఈ నిబంధన వర్తిస్తుందన్నారు. పైగా పరీక్షల దశలో ఉన్న వాటికేనని పేర్కొంటూ ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని