Anant-Radhika: అనంత్‌-రాధిక హస్తాక్షర్‌.. ఆకట్టుకున్న నీతా నాట్యం

కాబోయే వధూవరుల క్షేమాన్ని కోరుతూ ముకేశ్‌ అంబానీ సతీమణి నీతా అంబానీ(Nita Ambani) నిర్వహించిన నృత్య ప్రదర్శన అలరించింది. 

Updated : 04 Mar 2024 13:14 IST

ముంబయి: అనంత్‌ అంబానీ-రాధికా మర్చంట్ (Anant Ambani-Radhika Merchant) ప్రీవెడ్డింగ్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఆదివారం సాయంత్రం ‘హస్తాక్షర్’(సంతకం) తో వాటికి ముగింపు పలికారు. ఈ సందర్భంగా కాబోయే వధూవరులు సంప్రదాయ దుస్తుల్లో తళుక్కుమన్నారు.

హస్తాక్షర్ వేడుకలో భాగంగా సోదరి ఈశా అంబానీ, వదిన శ్లోకామెహతా.. అనంత్‌ను  వేదికవద్దకు తీసుకువచ్చారు. ఆ తర్వాత అంబానీ కుటుంబమంతా రాధిక రాక కోసం ఎదురుచూసింది. ‘కభీకుషీ కభీఘమ్‌’లోని పాట పాడుతూ ఆమె ఎంట్రీ ఇచ్చారు. ఆ సమయంలో ముకేశ్‌, నీతా అమితానందంతో కనిపించారు. తర్వాత అనంత్‌-రాధిక ఒక పండితుడి సమక్షంలో సంతకాలు చేశారు.

ఇదిలా ఉంటే.. చివరి రోజు నీతా అంబానీ ‘విశ్వంభరి స్తుతి’ పేరిట చేసిన నృత్య ప్రదర్శన అతిథులను అలరించింది. కాబోయే భార్యాభర్తలకు అమ్మవారి ఆశీస్సులను కోరుతూ ఆ నాట్యం చేశారు. మనవరాళ్లు ఆదియా శక్తి, వేదకు అంకితం చేశారు. కాగా.. గుజరాత్‌లోని జామ్‌ నగర్‌లో మూడురోజుల పాటు జరిగిన ప్రీవెడ్డింగ్ వేడుకల్లో వెయ్యిమంది దేశీయ, అంతర్జాతీయ స్థాయి ప్రముఖులు పాల్గొన్నారు. హాలీవుడ్ పాప్‌ గాయని రిహన్నా..తదితరులు ప్రదర్శనలు ఇచ్చారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని