Sundar Pichai: వర్క్‌-లైఫ్‌ బ్యాలెన్స్‌పై పిచాయ్‌.. చెప్పిన మాటకు కట్టుబడిన గూగుల్‌ బాస్‌

Sundar Pichai: వారానికి రెండు రోజులు రిమోట్‌ మోడల్‌లో పనిచేయడం వల్ల ఉద్యోగులు వర్క్‌-లైఫ్‌ని బ్యాలెన్స్‌ చేయొచ్చని గూగుల్‌ సీఈఓ సుందర్‌ పిచాయ్‌ అభిప్రాయపడ్డారు. దాన్నే ఇప్పుడు ఆచరణలో పెట్టారు.

Published : 04 Apr 2024 00:11 IST

Sundar Pichai | ఇంటర్నెట్‌డెస్క్‌: ఇంటర్నెట్‌డెస్క్‌: కొవిడ్‌ కారణంగా వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ సంస్కృతి ప్రారంభమైంది. తర్వాత హైబ్రిడ్‌ విధానం అమల్లోకి వచ్చింది. వర్క్‌ను, లైఫ్‌ను బ్యాలెన్స్‌ చేసేందుకు ఈ విధానం ఉపయోగపడుతుందని గతంలో గూగుల్‌ సీఈఓ సుందర్‌ పిచాయ్‌ అభిప్రాయపడ్డారు. రెండేళ్ల క్రితం దీనిపై మాట్లాడారు. దాన్ని ఆచరణలోనూ పెట్టారు. చాలా సంస్థలు ఉద్యోగుల్ని తిరిగి కార్యాలయాలకు రప్పిస్తున్నా.. గూగుల్‌ మాత్రం వర్క్‌ లైఫ్‌ బ్యాలెన్స్‌ చేసేలా తన విధానాన్ని రూపొందించడం గమనార్హం.

హైబ్రిడ్‌ విధానంలో పనిచేయడం వల్ల ఎన్నో సత్ఫలితాలు ఉంటాయని గతంలో పిచాయ్‌ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ‘‘వారానికి మూడు రోజులు ఆఫీసు నుంచి, రెండు రోజులు ఇంటి నుంచి పని చేసినప్పుడే  వర్క్‌-లైఫ్‌ సులభంగా బ్యాలెన్స్‌ చేయగలరని భావిస్తున్నా. ఆఫీసులో సహోద్యోగులతో కలిసి పని చేయడంతో పాటు ఇంటినుంచి పని చేయడం వల్ల రెండింటినీ సమతౌల్యం చేయడానికి వీలవుతుంది. ముఖ్యంగా న్యూయార్క్, శాన్ ఫ్రాన్సిస్కో వంటి ప్రధాన నగరాల్లో ఎక్కువ దూరం ప్రయాణించాల్సిన ఇబ్బందులు ఎదుర్కొంటున్నవారికి ఇది సరైన పరిష్కారం’’ అని సుందర్‌ పిచాయ్‌ 2021లో ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.

యాపిల్‌ యూజర్లకు కేంద్రం ‘హై-రిస్క్‌’ అలర్ట్‌..

సీఈఓ అభిప్రాయం మేరకు 2023లో గూగుల్‌ వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ పాలసీల్లో మార్పులు తీసుకొచ్చింది. అన్ని కంపెనీలు కచ్చితంగా ఆఫీసులకే వచ్చి పనిచేయాలని చెప్తుంటే.. గూగుల్‌ మాత్రం హైబ్రీడ్‌ విధానానికే జై కొట్టింది. వారానికి కనీసం మూడు రోజులు ఆఫీస్‌కు రావాలని కోరుతూ ఉద్యోగులకు సమాచారం అందించింది.  అయినప్పటికీ కంపెనీ ఉద్యోగులు మాత్రం ఈ విషయంపై విచారం వ్యక్తంచేస్తూ నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని కోరారు. దీంతో కార్యాలయంలో జరిపే చర్చల ప్రాముఖ్యతను గురించి గూగుల్‌ చీఫ్‌ ఉద్యోగులకు ఇ-మెయిల్స్‌ ద్వారా తెలియజేశారు. ఒకేచోట కలిసి పనిచేయడం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని