Google: 12 ఏళ్లుగా గూగుల్‌లో పనిచేశా.. మెటర్నిటీ లీవ్‌ సమయంలో లేఆఫ్‌..!

Google: మెటర్నిటీ సెలవుల్లో ఉన్న ఓ మహిళను గూగుల్‌ ఉద్యోగం నుంచి తొలగించింది. ఆ విషయాన్ని తెలుపుతూ ఆమె లింక్డిన్‌లో భావోద్వేగంతో పోస్ట్‌ చేశారు.

Published : 03 Oct 2023 21:31 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: గత కొన్ని నెలలుగా అనేక టెక్‌ కంపెనీలు పెద్ద సంఖ్యలో ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఈ విషయాన్ని తెలుపుతూ సామాజిక మాధ్యమాల వేదికగా  చాలా మంది పోస్టులు పెడుతూ తమ ఆవేదనను షేర్‌ చేసుకొంటున్నారు. తాజాగా అమెరికాకు చెందిన ఓ మహిళ సైతం ఇదే తరహా వేదనను లింక్డిన్‌ (LinkedIn)వేదికగా పంచుకున్నారు. తాను 12 ఏళ్లుగా ఉద్యోగం చేస్తున్నప్పటికీ మెటర్నిటీ సెలవుల్లో తనను ఉద్యోగం నుంచి తొలగించాంటూ భావోద్వేగంతో పోస్ట్‌ పెట్టారు. 

‘గూగుల్‌ (Google)లో పన్నెండున్నరేళ్లుగా పనిచేస్తున్నాను. మెటర్నిటీ సెలవుల్లో ఉన్న నన్ను ఉద్యోగం నుంచి తొలగించారు. 10 వారాల చిన్నారితో సంతోషంగా ఉన్న సమయంలో లేఆఫ్‌ వార్త విని చాలా బాధపడ్డాను. అయినప్పటికీ నేను సంస్థకు ఎప్పటికీ రుణపడి ఉంటాను. తర్వాత ఏం చేయాలి? ఇంటర్వ్యూలకు ఎలా వెళ్లాలి? ఇలాంటి సమయంలో వేరే చోట ఉద్యోగం చేయాలా? అనే ఆలోచనలతో నా మెదడు నిండిపోయింది’ అంటూ ఆమె తన పోస్ట్‌లో పంచుకున్నారు.

క్రికెట్‌ ఫ్యాన్స్‌కు డిస్నీ+ హాట్‌స్టార్‌ గుడ్‌న్యూస్‌.. కొత్త ఫీచర్లతో రెడీ

‘ఏదైనా పరిశ్రమలో స్టాఫింగ్ మేనేజర్, ప్రోగ్రామ్ మేనేజర్ పోస్ట్‌లు గురించి మీకు తెలిస్తే దయచేసి నాకు చెప్పండి. ఎవరైనా ఐసీ రిక్రూటర్ల కోసం ఎదురు చూస్తున్నట్లయితే.. నా టీమ్‌ను సంప్రదించండి’ అని భావోద్వేగంతో పోస్ట్‌ చేసింది. ఆమె పోస్ట్‌ చూసి పరిస్థితిని అర్థం చేసుకున్న కొందరు నెటిజన్లు సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. తాము కూడా ఇలాంటి పరిస్థితులనే ఎదుర్కొన్నట్లు తమ కష్టాన్ని పంచుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని