Disney+Hotstar: క్రికెట్‌ ఫ్యాన్స్‌కు డిస్నీ+ హాట్‌స్టార్‌ గుడ్‌న్యూస్‌.. కొత్త ఫీచర్లతో రెడీ

Disney+Hotstar adds new features: ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ+ హాట్‌స్టార్‌ కొత్త ఫీచర్లు తీసుకొచ్చింది. క్రికెట్‌ ఫ్యాన్స్‌కు మంచి క్రికెట్‌ అనుభూతి అందించేందుకు యాప్‌ను అప్‌డేట్‌ చేసింది.

Published : 04 Oct 2023 01:53 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: క్రికెట్ ప్రపంచకప్‌ ఫీవర్‌ (World cup) మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానున్న వేళ ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ+ హాట్‌స్టార్‌ (Disney+Hotstar) ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్‌ చెప్పింది. వరల్డ్‌కప్‌ మ్యాచ్‌లను మొబైల్‌ యాప్‌లో ఫ్రీగా తిలకించేందుకు అవకాశం కల్పిస్తున్న ఈ సంస్థ.. తాజాగా కొన్ని కొత్త ఫీచర్లను జోడించింది. వీక్షకులకు కొత్త అనుభూతిని అందించేందుకు ఈ మార్పులు చేపట్టినట్లు సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ మేరకు తన ఆండ్రాయిడ్‌, ఐఓఎస్‌ యాప్‌లను అప్‌డేట్‌ చేసింది.

మొబైల్‌ యూజర్ల కోసం డిస్నీ+ హాట్‌స్టార్‌ కొత్తగా మ్యాక్స్‌ వ్యూ (MaxView) ఫీచర్‌ను తీసుకొచ్చింది. ఐసీసీతో కలిసి ఈ సదుపాయాన్ని అందిస్తోంది. దీని ద్వారా వర్టికల్‌ మోడ్‌లో (నిలువుగా; 9×14) క్రికెట్‌ను వీక్షించొచ్చు. ఒంటి చేత్తో క్రికెట్‌ ప్రసారాలను ఆనందించొచ్చు. ఈ మోడ్‌లో లైవ్‌ ఫీడ్‌ ట్యాబ్‌, స్కోర్‌ కార్డు ట్యాబ్‌ కూడా కనిపిస్తాయి. దీంతో పాటు యూజర్‌ తనకు నచ్చిన ప్లేయర్‌ను మ్యాక్స్‌వ్యూ మోడ్‌లో వీక్షించొచ్చు. స్ప్లిట్‌ వ్యూలోనూ చూడొచ్చు.

ప్రపంచకప్‌ ముందు.. హిట్‌మ్యాన్‌ ప్రకంపనలు..!

హైక్వాలిటీలో మ్యాచ్‌లు వీక్షించినప్పటికీ తక్కువ డేటా ఖర్చయ్యే విధంగా తమ యాప్‌ను అప్‌డేట్‌ చేసినట్లు డిస్నీ+ హాట్‌స్టార్‌ పేర్కొంది. క్రికెట్‌ వీక్షణను మరింత చక్కటి అనుభూతిని అందించేందుకు ఏఐ ఆధారిత ఫిల్టర్లను వినియోగించినట్లు తెలిపింది. క్రికెట్‌ స్కోర్‌ కార్డుతో కూడిన పిల్‌ యాప్‌లో నిత్యం దర్శనమిస్తూ ఉంటుంది. ఒకవేళ ఓటీటీలో ఇతర కంటెంట్ చూస్తున్నప్పటికీ.. మ్యాచ్‌ వివరాలను దీని ద్వారా ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు.

డిస్నీ+హట్‌స్టార్‌లో కొత్తగా కమింగ్‌సూన్‌ ట్రే తీసుకొచ్చారు. అందులో రానున్న కంటెట్‌ కనిపిస్తుంది. దాంట్లో నచ్చిన వాటికి రిమైండర్‌ సెట్‌ చేసుకోవచ్చు. అలాగే ఫ్రీ కంటెంట్‌ను, పెయిడ్‌ కంటెంట్‌ను వేర్వేరుగా ఇకపై యాప్‌ చూపిస్తుంది. యాప్‌లో ఫ్రీ బ్యాడ్జ్‌ కలిగిన ఇతర కంటెంట్‌నూ యూజర్లు ఫ్రీ వీక్షించొచ్చు. అక్టోబర్‌ 5 నుంచి ప్రారంభమయ్యే మ్యాచ్‌లు మొబైల్‌ యాప్‌లో మాత్రమే ఫ్రీగా లభిస్తాయి. కంప్యూటర్‌, ల్యాప్‌ట్యాప్‌లు, ట్యాబ్‌ల్లో వీక్షించాలంటే మాత్రం డిస్నీ+హాట్‌స్టార్‌ సబ్‌స్క్రిప్షన్‌ తీసుకోవాల్సిందే. ప్రస్తుతం డిస్నీ+ హాట్‌స్టార్‌ యాడ్స్‌తో కూడిన వార్షిక ప్లాన్‌ ధర రూ. 899 కాగా.. యాడ్‌ ఫ్రీ ప్లాన్‌ ధర రూ.1499గా లభిస్తోంది. మొబైల్‌ సబ్‌స్క్రిప్షన్‌ ప్లాన్‌ రూ.499కి లభిస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని