ఇకపై గూగుల్‌ మెసేజ్‌లనూ ఎడిట్‌ చేయొచ్చు

Google Messages: గూగుల్‌ మెసేజెస్‌ కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇకపై ఇందులో పంపే సందేశాల్లో ఏవైనా తప్పులుంటే ఎడిట్‌ చేసే అవకాశం కల్పించింది.

Published : 31 May 2024 14:22 IST

Google Messages | ఇంటర్నెట్‌డెస్క్‌: ఇతర మెసేజింగ్ యాప్‌లకు పోటీగా గూగుల్ (Google) తన యాప్‌ను ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతోంది. సరికొత్త ఫీచర్లను తీసుకొస్తూ యూజర్లను ఆకట్టుకుంటోంది. ఇప్పటివరకు వాట్సప్‌(WhatsApp), ఇన్‌స్టాగ్రామ్‌ (Instagram).. వంటి యాప్‌లకే పరిమితమైన ‘‘ఎడిట్‌’’ ఆప్షన్‌ను తన యాప్‌నకు జోడించింది. అంటే ఇకపై RCS చాట్‌ ద్వారా పంపే సందేశాలనూ ఎడిట్‌ చేసేయొచ్చన్నమాట.

సాధారణ ఎస్సెమ్మెస్‌/ఎంఎంఎస్‌ టెక్ట్సింగ్‌కు అప్‌గ్రేడ్‌ ఈ రిచ్‌ కమ్యూనికేషన్‌ సర్వీసెస్‌ (RCS). ఇందులో వాట్సప్‌ తరహా సదుపాయాలు ఉంటాయి. గూగుల్‌ తీసుకొచ్చిన కొత్త ఫీచర్‌ సాయంతో RCS ద్వారా పంపే ఏ మెసేజ్‌నైనా ఎడిట్‌ చేసుకోవచ్చు. అందుకోసం మనం పంపిన మెసేజ్‌పై లాంగ్‌ ప్రెస్‌ చేస్తే.. పాప్‌ అప్‌ మెనూ ఓపెన్‌ అవుతుంది. అందులో ‘‘ఎడిట్‌’’ ఆప్షన్‌ను ఎంచుకుని సందేశంలోని తప్పులు సరిదిద్దుకోవచ్చు. ఇలా సవరించిన మెసేజ్‌కు కింద చివరన ఎడిటెడ్‌ అని స్పష్టంగా కనిపిస్తుంది. అయితే.. సందేశాన్ని పంపిన 15 నిమిషాల్లోనే ఎడిట్‌ చేసే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత ఎడిట్‌ ఆప్షన్‌ కనిపించదు. కేవలం ఆర్‌సీఎస్‌ చాట్‌లకు మాత్రమే ఈ ఫీచర్‌ అందుబాటులో ఉంది. SMS/MMSలకు లేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు