Google Pixel 8: మార్కెట్‌లోకి గూగుల్‌ పిక్సెల్‌ 8.. ధర, ఫీచర్లివే..!

Google Pixel 8: దేశీయ విపణిలోకి గూగుల్‌ పిక్సెల్‌ 8 స్మార్ట్‌ఫోన్లు బుధవారం విడుదలయ్యాయి. అత్యాధునిక, శక్తిమంత కెమేరాలు అమర్చిన ఈ ఫోన్‌ ధరలు రూ.75,999 నుంచి ప్రారంభమవుతున్నాయి.

Updated : 05 Oct 2023 10:47 IST

Google Pixel 8 |  దేశీయ విపణిలోకి గూగుల్‌ పిక్సెల్‌ 8 (Google Pixel 8 series) స్మార్ట్‌ఫోన్లు బుధవారం విడుదలయ్యాయి. అత్యాధునిక, శక్తిమంత కెమేరాలు అమర్చిన ఈ ఫోన్‌ ధరలు రూ.75,999 నుంచి ప్రారంభమవుతున్నాయి. ఆండ్రాయిడ్‌ 14 ఆపరేటింగ్‌ సిస్టమ్‌, 6.2 అంగుళాల యాక్చువా డిస్‌ప్లే, 50 ఎంపీ పీడీ వైడ్‌ ప్రైమరీ సెన్సర్‌, 12 ఎంపీ అల్ట్రావైడ్‌ కెమేరా, 10.5 ఎంపీ సెల్ఫీ కెమేరా, 4575 ఎంఏహెచ్‌ బ్యాటరీ, క్యూఐ వైర్‌లెస్‌ ఛార్జింగ్‌ సపోర్ట్‌ వంటి ఫీచర్లు కలిగిన ఈ ఫోన్‌ 128, 256 జీబీ మెమొరీతో లభించనుంది. 8జీబీ ర్యామ్‌, టెన్సర్‌ జీ3 ప్రాసెసర్లు ఈ ఫోన్‌కు ఉన్నాయి. పిక్సెల్‌ 8 ప్రో (Google Pixel 8 pro) 6.7 అంగుళాల డిస్‌ప్లే, 512 జీబీ వరకు మెమొరీ, 12 జీబీ ర్యామ్‌ కలిగిన ఈ ఫోన్‌ ధర రూ.1,06,999.

లాంఛ్‌ ఆఫర్లు..

ప్రస్తుతం ఈ ఫోన్లు ఫ్లిప్‌కార్ట్‌ (Flipkart)లో విక్రయానికి అందుబాటులో ఉన్నాయి. బ్యాంకు రాయితీ, ఎక్స్ఛేంజ్‌ ఆఫర్లను ఉపయోగించుకుంటే ఈ ఫోన్ల ధరలు మరింత తగ్గుతాయి. పిక్సెల్‌ 8 ధర రూ.75,999 కాగా.. రూ.3,000 ఎక్స్ఛేంజ్‌ ఆఫర్‌, బ్యాంకు రాయితీ రూ.8,000 తర్వాత ఈ ఫోన్‌ రూ.64,999కే సొంతం చేసుకోవచ్చు. మరోవైపు పిక్సెల్‌ 8 ప్రో ధర రూ.1,06,999. రూ.4,000 ఎక్స్ఛేంజ్‌ ఆఫర్‌, రూ.9,000 బ్యాంకు రాయితీతో రూ.93,999కే ఈ ఫోన్‌ను కొనుగోలు చేయొచ్చు. ఐసీఐసీఐ బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ కార్డులపై రాయితీలు ఉన్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని