Google: గూగుల్‌ LUMIERE AI.. టెక్ట్స్‌తో వీడియో క్రియేట్‌ చేసేలా..

Google: లుమియర్‌ పేరుతో కొత్త ఏఐ మోడల్‌ను గూగుల్‌ తీసుకొచ్చింది. ఈ ఏఐ వీడియోను రూపొందించడాన్ని సులభతరం చేస్తుంది.

Published : 27 Jan 2024 22:15 IST

Google LUMIERE AI | ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రముఖ సెర్చింజన్‌ గూగుల్ (Google) లుమియర్‌ (LUMIERE) పేరుతో అడ్వాన్స్‌డ్‌ వెర్షన్‌ ఏఐ మోడల్‌ను ఆవిష్కరించింది. దీంతో సులువుగా వీడియో క్రియేట్‌ చేయొచ్చని పేర్కొంది. టెక్ట్స్‌ -టు వీడియో, ఇమేజ్‌ -టు వీడియో, వీడియో ఇన్‌ పెయింటింగ్‌ లాంటి కొత్త ఫీచర్లు ఇందులో ఉన్నట్లు వెల్లడించింది. దీనికి సంబంధించిన వీడియోను గూగుల్ ఏఐ తన అధికారిక ‘ఎక్స్’ లో పోస్ట్‌ చేసింది.

స్పేస్-టైమ్ U నెట్ ఆర్కిటెక్చర్‌తో లుమియర్ ఏఐ పనిచేస్తుంది. వీడియో రూపొందించడాన్ని ఇది సులభతరం చేస్తుంది. మీరు రూపొందించాలనుకున్న అంశానికి సంబంధించిన టెక్ట్స్‌ను అందిస్తే చాలు ఈ ఏఐ వీడియోని క్రియేట్‌ చేస్తుంది. ఉదాహరణకు.. ‘చిన్న పిల్లవాడు పొలాల మధ్య పరిగెత్తున్నాడు’ అని టెక్ట్స్‌ ఇస్తే చేస్తే అలాంటి వీడియోను రెడీ చేస్తుంది. ఏ ఫొటోతోనైనా వీడియో రూపొందించేందుకు ఇది సాయపడుతుంది. వీడియో స్టైలైజేషన్, సినిమాగ్రాఫ్స్‌, వీడియో పెయింటింగ్‌తో పాటు అనేక టూల్స్‌ ఇందులో ఉన్నాయి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని