Onion exports: ఉల్లి ఎగుమతులపై నిషేధాన్ని పొడిగించిన కేంద్రం

Onion exports: ఉల్లి ఎగుమతులపై నిషేధాన్ని పొడిగిస్తున్నట్లు డైరెక్టరేట్‌ జనరల్ ఆఫ్‌ ఫారిన్‌ ట్రేడ్‌ తన నోటిఫికేషన్‌లో పేర్కొంది.

Published : 23 Mar 2024 19:05 IST

దిల్లీ: ప్రభుత్వం ఉల్లి ఎగుమతులపై నిషేధాన్ని పొడిగించింది. దేశీయ మార్కెట్‌లో పెరుగుతున్న ఉల్లి ధరల్ని అదుపు చేయడానికి, తగిన నిల్వల్ని అందుబాటులో ఉంచేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. గతంలో విధించిన ఆంక్షల గడువు మార్చి 31తో ముగియనుంది. ఈనేపథ్యంలో వీటి ఎగుమతులపై ఉన్న నిషేధాన్ని పొడిగించినట్లు కేంద్రం ప్రకటించింది. తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు ఈ నిషేధం కొనసాగుతుందని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (DGFT) నోటిఫికేషన్‌లో తెలిపింది.

డిజీ లాకర్‌తో ఆధార్‌, పాన్‌ వంటి పత్రాలు ఎప్పుడూ మీ వెంటే.. ఎలా దాచుకోవాలి?

ఉల్లి ధరల్ని నియంత్రించడానికి కేంద్రం గతంలో అనేక చర్యలు చేపట్టింది. గతేడాదిలో అక్టోబర్ 28 నుంచి డిసెంబర్ 31 వరకు ఉల్లిపాయల ఎగుమతులపై టన్నుకు కనీస ఎగుమతి ధరను (MEP) 800 డాలర్లుగా నిర్ణయించింది. ఆగస్టులో వీటిపై 40 శాతం ఎగుమతి సుంకాన్ని విధించింది. తర్వాత డిసెంబరు 8న కేంద్రం ఎగుమతులపై నిషేధం విధించింది. బఫర్‌ స్టాక్‌ను విడుదల చేసింది. ఆ సమయంలో నేషనల్ కో-ఆపరేటివ్ ఎక్స్‌పోర్ట్స్ లిమిటెడ్ (NCEL) ద్వారా యూఏఈ (UAE), బంగ్లాదేశ్‌లకు 64,400 టన్నుల ఉల్లిని ఎగుమతి చేయడానికి ప్రభుత్వం అనుమతించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని