Govt Borrowings: ఆరు నెలల్లో.. రూ.7.5 లక్షల కోట్ల రుణానికి కేంద్రం సిద్ధం

2024-25 ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల కాలానికి దాదాపు రూ.7.5 లక్షల కోట్లు రుణాల రూపంలో సమీకరించేందుకు ప్రణాళికను రూపొందించినట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

Updated : 27 Mar 2024 20:12 IST

దిల్లీ: ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించడంతో పాటు రెవెన్యూ లోటు భర్తీ చేయడానికి మార్కెట్‌ నుంచి రుణ సమీకరణకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఇందుకోసం 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్‌-సెప్టెంబర్‌ మధ్య కాలానికి దాదాపు రూ.7.5 లక్షల కోట్లు సమీకరించేందుకు ప్రణాళిక రూపొందించినట్లు ఆర్థిక మంత్రిత్వశాఖ వెల్లడించింది.

ఎస్‌బీఐ డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమల్లోకి

2024-25 ఆర్థిక సంవత్సరానికి స్థూలంగా రూ.14.13 లక్షల కోట్లను అప్పుల రూపంలో సమీకరించాలని ప్రభుత్వం అంచనా వేసింది. ఇందులో దాదాపు 53 శాతం (రూ.7.5లక్షలు) తొలి అర్ధ సంవత్సరంలోనే తీసుకునేందుకు తాజాగా ఓ ప్రణాళికను రూపొందించింది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో రెవెన్యూ లోటు తీర్చడానికి సెక్యూరిటీలు జారీచేయడం ద్వారా ఈ రుణాలను సేకరించాలని మధ్యంతర బడ్జెట్‌లోనే ఈ ప్రతిపాదనలు చేసింది. అయితే, గతేడాది 2023-24 అంచనాలతో (రూ.15.43లక్షల కోట్లు) పోలిస్తే ఇది తక్కువే. ప్రైవేటు పెట్టుబడులు భారీఎత్తున వస్తున్నందున రుణ సేకరణకు కేంద్ర ప్రభుత్వం తగ్గించుకుంటోందని ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ అప్పట్లో పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని