Elon Musk: మస్క్‌తో బంధం..ఇంటర్న్‌షిప్‌ లాంటిది..!

ప్రముఖ పారిశ్రామికవేత ఎలాన్‌ మస్క్‌, మెటా అధినేత మార్క్ జుకర్‌బర్గ్‌ మధ్య కేజ్‌ ఫైట్ జరగడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ క్రమంలో ఆ ఫైట్ గురించి మస్క్‌(Elon Musk) మాజీ ప్రియురాలు గ్రిమ్స్‌ స్పందించారు.

Updated : 10 Aug 2023 17:18 IST

వాషింగ్టన్‌: ప్రపంచకుబేరుడు ఎలాన్‌ మస్క్(Elon Musk)తో బంధం గురించి మాజీ ప్రియురాలు గ్రిమ్స్‌(Grimes) స్పందించారు. అది ఒక అత్యుత్తమైన ఇంటర్న్‌షిప్ అని వ్యాఖ్యానించారు. ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో భాగంగా ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. 

‘నేను ఆయన నుంచి చాలా నేర్చుకున్నాను. ఆ బంధం అత్యత్తమ ఇంటర్న్‌షిప్ లాంటిది. ఎలాన్‌ గురించి మాట్లాడటం కొందరికి ఇష్టం ఉండదు. కానీ స్పేస్‌ఎక్స్‌( SpaceX)ను చూసినప్పుడు ఆయన నాయకత్వ లక్షణాలు ఎంత గొప్పవో అర్థమవుతుంది’ అని అన్నారు. ఇప్పటికీ తమ మధ్య అనుబంధం ఉందని, ఆయన తన బెస్ట్‌ ఫ్రెండ్ అని వెల్లడించారు. అలాగే తన ఇద్దరు పిల్లల గురించి చెప్పారు. తన కుమారుడు  X AE A-Xii ఒక లిటిల్ ఇంజనీర్ అని, అతడు స్పేస్ పట్ల అత్యంత ఆసక్తితో ఉన్నాడని చెప్పారు. స్టార్‌షిప్ పేలిపోయిన సమయంలో.. తీవ్ర ఆవేదన చెందాడని చెప్పారు. 

అప్పట్లో నిద్ర ‘అనవసరం’ అనుకున్నా..: బిల్‌ గేట్స్‌

అలాగే మస్క్‌, మెటా అధినేత జుకర్‌బర్గ్‌ మధ్య జరగనున్న కేజ్‌ ఫైట్ గురించి మాట్లాడుతూ.. ‘ఆ తరహా మ్యాచ్‌లు చూడటం నాకిష్టం. కానీ మనతో సంబంధం ఉన్న వ్యక్తులు అలాంటి శారీరక పోరాటాల్లో భాగమైతే అంత సంతోషంగా ఉండకపోవచ్చు’ అని ఆమె వ్యాఖ్యానించారు. మస్క్‌, గ్రిమ్స్‌ మూడేళ్ల పాటు డేటింగ్ చేశారు. తర్వాత వారు విడిపోయారు. వారికి ఇద్దరు సంతానం. ఎలాన్‌ మస్క్ తన కుమారుడు  X AE A-Xiiతో కలిసి స్పేస్‌ఎక్స్( SpaceX) ప్రధాన కార్యాలయంలో సరదా గడుపుతుంటారు. దానికి సంబంధించిన చిత్రాలు ఇటీవల వైరల్ అయ్యాయి. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని