GST council: మిల్లెట్ల పిండిపై జీఎస్టీ తగ్గింపు.. కౌన్సిల్‌ నిర్ణయాలు ఇవే

GST council outcome: మిల్లెట్లపై జీఎస్టీని తగ్గిస్తూ కౌన్సిల్‌ నిర్ణయం తీసుకుంది. ప్యాకేజీ రూపంలో విక్రయిస్తే 5 శాతం, లూజుగా విక్రయిస్తే ఎలాంటి జీఎస్టీ వర్తించదని నిర్మలా సీతారామన్‌ తెలిపారు.

Updated : 07 Oct 2023 17:30 IST

దిల్లీ: మిల్లెట్ల పిండిపై జీఎస్టీని (GST) తగ్గిస్తూ జీఎస్టీ కౌన్సిల్‌ (GST Council) నిర్ణయం తీసుకుంది. ప్రీ ప్యాకేజ్డ్‌ లేదా లేబుల్‌ వేసి విక్రయిస్తే ఇకపై 5 శాతం మాత్రమే జీఎస్టీ వర్తిస్తుందని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు. ఇంతకుముందు దీనిపై జీఎస్టీ 18 శాతంగా ఉండేది. కనీసం 70 శాతం మిల్లెట్లతో కూడిన పిండిని లూజుగా విక్రయిస్తే.. ఎలాంటి జీఎస్టీ వర్తించదని చెప్పారు. మిల్లెట్లను ప్రోత్సహించే ఉద్దేశంతో కౌన్సిల్‌ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు దిల్లీలో జరిగిన 52వ జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశం అనంతరం నిర్మలా సీతారామన్‌ సమావేశం నిర్ణయాలను వెల్లడించారు.

మార్కెట్‌లోకి ఈప్లూటో 7జీ మ్యాక్స్‌ స్కూటీ.. ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే 201km

ఇదే సమావేశంలో మొలాసిస్‌పై జీఎస్టీని తగ్గిస్తూ జీఎస్టీ కౌన్సిల్‌ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం మొలాసిస్‌పై జీఎస్టీ 28 శాతంగా ఉండగా.. దాన్ని 5 శాతానికి తగ్గించేందుకు కౌన్సిల్‌ నిర్ణయించింది. దీనివల్ల చెరకు రైతులకు మేలు చేకూరుతుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు. మానవ అవసరాల కోసం వినియోగించే డిస్టిల్‌ ఆల్కహాల్‌ను జీఎస్టీ నుంచి మినహాయిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా జీఎస్టీ అప్పీలేట్‌ ట్రైబ్యునల్‌ (GSTAT) ప్రెసిడెంట్‌, సభ్యుల గరిష్ఠ వయసును నిర్ణయించారు. ఇకపై GSTAT అధ్యక్షుడి గరిష్ఠ వయసు 70 ఏళ్లు, సభ్యుల వయసు 67 ఏళ్లుగా నిర్ణయించారు. ప్రస్తుతం ఈ వయో పరిమితి అధ్యక్షులకు 67,  సభ్యులకు 65గా ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని