ePluto 7G Max: మార్కెట్‌లోకి ఈప్లూటో 7జీ మ్యాక్స్‌ స్కూటీ.. ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే 201km

ePluto 7G Max: ప్యూర్‌ ఈవీ భారత విపణిలోకి మరో కొత్త విద్యుత్‌ స్కూటర్‌ను విడుదల చేసింది. ఇది మ్యాట్‌ బ్లాక్‌, రెడ్‌, గ్రే, తెలుపు రంగుల్లో అందుబాటులో ఉంది.

Published : 06 Oct 2023 17:09 IST

ePluto 7G Max | ఇంటర్నెట్‌ డెస్క్‌: విద్యుత్‌ వాహన తయారీ సంస్థ ప్యూర్‌ ఈవీ ఈప్లూటో 7జీ మ్యాక్స్‌ (ePluto 7G Max) స్కూటీని విడుదల చేసింది. దీని ధర రూ.1.14 లక్షలు. ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే 201 కిలోమీటర్లు ప్రయాణిస్తుందని కంపెనీ తెలిపింది. హిల్‌స్టార్ట్‌ అసిస్ట్‌, డౌన్‌హిల్‌ అసిస్ట్‌, కోస్టింగ్‌ రీజెన్‌, రివర్స్‌ మోడ్‌ వంటి ఫీచర్లు ఉన్నాయి. మ్యాట్‌ బ్లాక్‌, రెడ్‌, గ్రే, తెలుపు రంగుల్లో ఈ స్కూటీ అందుబాటులో ఉంది.

ఈ స్కూటీలో స్మార్ట్‌ బీఎంఎస్‌తో కూడిన AIS-156 సర్టిఫైడ్‌ 3.5kWh హెవీ-డ్యూటీ బ్యాటరీని పొందుపర్చారు. బ్లూటూత్‌ కనెక్టివిటీ, 2.4 KW గరిష్ఠ శక్తిని ఉత్పత్తి చేసే పవర్‌ ట్రెయిన్‌, సీఏఎన్‌ ఆధారిత ఛార్జర్‌ వస్తున్నాయి. మూడు రకాల డ్రైవింగ్‌ మోడ్‌లు ఉన్నాయి. రానున్న రోజుల్లో వచ్చే ఎలాంటి ఓటీఏ ఫర్మ్‌వేర్‌ అప్‌డేట్లనైనా తీసుకునేలా స్కూటీని తీర్చిదిద్దినట్లు కంపెనీ తెలిపింది. రోజుకి కనీసం 100 కిలోమీటర్లు ప్రయాణించే కస్టమర్లను దృష్టిలో ఉంచుకొని దీన్ని మార్కెట్‌లోకి తీసుకొస్తున్నట్లు ప్యూర్‌ ఈవీ సహ- వ్యవస్థాపకుడు, సీఈఓ రోహిత్‌ వడెరా తెలిపారు. పండగ సీజన్‌లో లాంఛ్‌ చేస్తున్న నేపథ్యంలో గిరాకీ ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

బ్యాటరీ స్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించే ఏఐ ఆధారిత పవర్‌ డిశ్చార్జ్‌ వంటి అధునాతన ఫీచర్లను ఈ స్కూటీలో చేర్చినట్లు రోహిత్‌ తెలిపారు. దీని వల్ల బ్యాటరీ లైఫ్‌ సైకిల్‌ 50 శాతం పెరుగుతుందన్నారు. బండి ఒకవైపు వంగిన సమయంలో కింద పడకుండా నియంత్రించేలా స్మార్ట్‌ సెన్సర్లు ఉన్నట్లు తెలిపారు. ఎత్తు ప్రదేశం నుంచి దిగుతున్నప్పుడు బండి జారకుండా కూడా ఇవి నియంత్రిస్తాయని వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని