Retail Brands: రిటైల్‌ బ్రాండ్ల చూపు.. ఆలయ నగరాల వైపు

Retail Brands: ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, చేపడుతున్న కార్యక్రమాల ద్వారా దేశంలో ఆధ్యాత్మిక పర్యటకం అభివృద్ధి చెందుతోంది. దీంతో రిటైల్ బ్రాండ్లు ఆధ్యాత్మిక నగరాలకు తమ వ్యాపారాన్ని విస్తరిస్తున్నాయి.

Published : 29 Mar 2024 00:16 IST

Retail Brands | దిల్లీ: దేశంలో ఆధ్యాత్మిక పర్యటకం పరుగులు తీస్తోంది. పెద్ద సంఖ్యలో యాత్రికులు క్షేత్రాలను దర్శించుకుంటూ ఉంటారు. ఇదే అవకాశంగా ప్రముఖ బ్రాండ్లు తమ వ్యాపారాన్ని విస్తరిస్తున్నాయి. అయోధ్య, వారణాసి, అమృత్‌సర్, పూరి, తిరుపతి, అజ్మీర్ లాంటి 14 ముఖ్య నగరాల్లో తమ ఉత్పత్తులను అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. యాత్రికుల అవసరాలకు అనుగుణంగా తమ ఉత్పత్తులను అందిస్తున్నాయని రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ CBRE ఈ మేరకు ఓ నివేదిక విడుదల చేసింది.

అమృత్‌సర్‌, అజ్మీర్‌, వారణాసి, కట్‌ఢా, సోమనాథ్‌, శిర్డీ, అయోధ్య, పూరి, తిరుపతి, మథుర, ద్వారక, బోధ్‌ గయ, గురువాయూర్, మధురై నగరాల్లో రిటైల్‌ బ్రాండ్లు విస్తరిస్తున్నాయని నివేదిక పేర్కొంది. పెరుగుతున్న పర్యాటకులకు అనుగుణంగా మాల్స్‌లో, మార్కెట్లలో తమ వ్యాపారాలను ఏర్పాటు చేస్తున్నాయని తెలిపింది. ఇప్పటికే అయోధ్యలో మాన్యవర్, రిలయన్స్ ట్రెండ్స్, రేమండ్స్, మార్కెట్ 99, పాంటలూన్స్, డొమినోస్, పిజ్జా హట్, రిలయన్స్ స్మార్ట్ తమ రిటైల్ స్టోర్‌లను ప్రారంభించాయని వెల్లడించింది. పర్యటకాన్ని ప్రోత్సహించడానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, చేపడుతున్న కార్యక్రమాలు ఈ రంగం వృద్ధిని మరింత పెంచుతున్నాయని నివేదికలో తెలిపింది. 

మస్క్‌ కీలక ప్రకటన.. వారికి ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌ ఫ్రీ!

దుస్తులు, ఆహారం, పానీయాలు, హైపర్‌ మార్కెట్‌లు, హోమ్‌వేర్, డిపార్ట్‌మెంట్ స్టోర్స్‌ సహా అన్ని విభాగాల్లో రిటైల్ బ్రాండ్‌లు తమ సత్తా చాటుతున్నాయని పేర్కొంది. ‘‘ఆధ్యాత్మిక పర్యటకం పెరుగుతున్న కారణంగా మార్కెట్‌ సామర్థ్యాన్ని వినియోగించుకునేందుకు పెట్టుబడిదారులు తరలివస్తున్నారు. యాత్రికుల అవసరాలను తీర్చాలనే ఉద్దేశంతో నాణ్యమైన వసతుల్ని అందిస్తూ, మౌలిక సదుపాయాలు పెంచుతూ ఆర్థిక వృద్ధికి సాయపడుతున్నారు’’ అని సీబీఆర్‌ఈ ఇండియా అడ్వైజరీ అండ్‌ ట్రాన్సాక్షన్ సర్వీసెస్ మేనేజింగ్ డైరెక్టర్ రామ్ చందనాని అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని