Broadband: మీ ప్రాంతంలో బ్రాడ్‌బ్యాండ్‌ సేవలందించే సంస్థలేవో ఎలా తెలుసుకోవాలి?

మీ ప్రాంతంలో ఏయే సంస్థలు బ్రాడ్‌బ్యాండ్‌ సేవలందిస్తున్నాయో తెలుసుకోవాలా? అయితే, ఈ వెబ్‌సైట్‌ను సందర్శించండి.

Updated : 19 Apr 2024 14:22 IST

Broadband | ఇంటర్నెట్‌ డెస్క్‌: స్మార్ట్‌ఫోన్‌కు మొబైల్‌ డేటా ఎలానో.. ప్రతి ఇంటికీ ఇంటర్నెట్‌ కనెక్టివిటీ అంతే అవసరంగా మారిపోయింది. ఇంట్లో స్మార్ట్‌టీవీ, సీసీ టీవీ కెమెరాలు వినియోగించాలన్నా బ్రాడ్‌బ్యాండ్‌ (Broadband) కనెక్షన్‌ తప్పనిసరి. సాధారణంగా ఏళ్లుగా ఒకే చోట ఉండేవారికి స్థానికంగా ఏయే బ్రాండ్‌బ్యాండ్‌ సేవలు అందుబాటులో ఉన్నాయో తెలుసుకోవడం సులువే. అదే ఆ పట్టణానికి లేదా ఆ ప్రాంతానికి కొత్తగా వచ్చిన వారైతే ఏ సంస్థలు సేవలందిస్తున్నాయో తెలుసుకోవడం కష్టం. అందుకోసం ఇరుగుపొరుగు వారిని వాకబు చేయాల్సిందే. అలాంటి అవసరం లేకుండా ప్రభుత్వమే ఆ సమాచారాన్ని అందిస్తోంది.

ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే సంచార్‌సాథీ పోర్టల్‌లో (sancharsaathi.gov.in) ఈ సమాచారం లభిస్తుంది. వెబ్‌సైట్‌ ఓపెన్‌ చేసి కాస్త దిగువకు వెళ్తే నో యువర్‌ వైర్‌లైన్‌ ఇంటర్నెట్ సర్వీస్‌ ప్రొవైడర్‌ (KYI)అనే ఆప్షన్‌ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేశాక మీ ఏరియా పిన్‌ కోడ్‌ ఎంటర్‌ చేస్తే ఆ ప్రదేశంలో ఏయే సంస్థలు బ్రాడ్‌బ్యాండ్ అందిస్తున్నాయో తెలుస్తుంది. కంపెనీ పేరు, ఇ-మెయిల్‌, సంప్రదించాల్సిన ఫోన్‌ నంబర్‌, వెబ్‌సైట్‌ కనిపిస్తాయి. అందులో జియో, ఎయిర్‌టెల్‌, బీఎస్‌ఎన్‌ఎల్‌, యాక్ట్‌ వంటి గృహ అవసరాలకు ఫైబర్‌ నెట్‌ సేవలందించే సంస్థలతో పాటు వాణిజ్య అవసరాలకు కనెక్షన్లు ఇచ్చే వాటి వివరాలూ దర్శనమిస్తాయి. దాంతో సులువుగా మీకు నచ్చినది బుక్‌ చేసుకోవచ్చు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని