Chromebook: భారత్‌లో క్రోమ్‌బుక్‌ల తయారీ ప్రారంభం.. రూ.15,990కే కొత్త క్రోమ్‌బుక్‌!

Chromebook: హెచ్‌పీతో గూగుల్‌ భాగస్వామ్యం కుదుర్చుకొని భారత్‌లోనే క్రోమ్‌బుక్‌లను తయారు చేస్తోంది. త్వరలోనే ఇవి విక్రయానికి అందుబాటులోకి రానున్నాయని సమాచారం.

Published : 02 Oct 2023 17:09 IST

Chromebook | దిల్లీ: భారత్‌లో క్రోమ్‌బుక్‌ (Chromebook)ల తయారీ ప్రారంభమైంది. గూగుల్‌తో కంప్యూటర్ల తయారీ సంస్థ హెచ్‌పీ చేతులు కలిపిన విషయం తెలిసిందే. చెన్నై సమీపంలోని ఫ్లెక్‌ ఫెసిలిటీ ప్లాంటు వద్ద ఈ క్రోమ్‌బుక్‌ (Chromebook)ల తయారీ నేటి నుంచి మొదలైనట్లు హెచ్‌పీ అధికార ప్రతినిధి వెల్లడించారు. ఈ ప్లాంటులో 2020 ఆగస్టు నుంచి పలు రకాల ల్యాప్‌టాప్‌లు, డెస్క్‌టాప్‌లను హెచ్‌పీ తయారు చేస్తోంది. 

‘‘భారతదేశంలో Chromebookలను తయారు చేయడానికి మేం HPతో భాగస్వామ్యం కుదుర్చుకున్నాం. భారత్‌లో Chromebookలను తయారు చేయడం ఇదే తొలిసారి. ఫలితంగా భారతీయ విద్యార్థులకు చౌకైన, సురక్షితమైన కంప్యూటింగ్‌కు అవకాశాలు మెరుగుపడతాయి’’ అని గూగుల్‌ సీఈఓ సుందర్‌ పిచాయ్‌ సోమవారం ‘ఎక్స్‌’ (ట్విటర్‌)లో పోస్ట్‌ చేశారు. కొత్త క్రోమ్‌బుక్‌ (Chromebook)లు రూ.15,990 ప్రారంభ ధర వద్ద ఆన్‌లైన్‌లో అందుబాటులోకి వస్తాయని హెచ్‌పీ ప్రతినిధి ఒకరు తెలిపారు.

ఐటీ హార్డ్‌వేర్‌ ఉత్పత్తులకు సంబంధించి రూ.17,000 కోట్ల ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం కింద దరఖాస్తు చేసుకున్న సంస్థల్లో హెచ్‌పీ కూడా ఉంది. 2020 నుంచి హెచ్‌పీ భారత్‌లో తయారీని పెంచుకుంటూ వస్తోంది. 2021 డిసెంబర్‌ నుంచి వివిధ రకాల ల్యాప్‌టాప్‌లను భారత్‌లో ఉత్పత్తి చేస్తోంది. హెచ్‌పీ ఎలైట్‌బుక్స్‌, హెచ్‌పీ ప్రోబుక్స్‌, హెచ్‌పీ జీ8 సిరీస్‌ నోట్‌బుక్స్‌ ఇక్కడే తయారవుతున్నాయి. వాణిజ్య డెస్క్‌టాప్‌ల తయారీని సైతం విస్తరించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని