ICICI Bank Q2 Results: ఐసీఐసీఐ బ్యాంక్‌ లాభంలో 36 శాతం వృద్ధి

ICICI Bank Q2 Results: ప్రముఖ ప్రైవేటు రంగ బ్యాంక్‌ ఐసీఐసీఐ సెప్టెంబరుతో ముగిసిన రెండో త్రైమాసిక ఫలితాల్ని శనివారం ప్రకటించింది.

Published : 21 Oct 2023 19:37 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రైవేటు రంగానికి చెందిన ప్రముఖ బ్యాంక్‌ ఐసీఐసీఐ (ICICI) రెండో త్రైమాసికంలో (Q2 Results) ఆకర్షణీయ ఫలితాల్ని ప్రకటించింది. సెప్టెంబరుతో ముగిసిన  త్రైమాసికంలో స్టాండలోన్‌ పద్దతిలో రూ.10,261 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసుకుంది. గతేడాది ఇదే సమయంలో నమోదైన రూ.7,558 కోట్లతో పోలిస్తే 36 శాతం వృద్ధి చెందినట్లు బ్యాంక్‌ తన రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది.

ఫ్లిప్‌కార్ట్‌ నుంచి మరో సేల్‌.. ఈ కార్డులపై డిస్కౌంట్స్‌

సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసికంలో బ్యాంక్‌ మొత్తం ఆదాయం రూ. 31,088 కోట్ల నుంచి రూ.40,697 కోట్లకు పెరిగినట్లు ఐసీఐసీఐ వెల్లడించింది. నికర వడ్డీ ఆదాయం రూ.18,308 కోట్లకు చేరింది. గతేడాది ఇదే సమయంలో నమోదైన రూ.14,787 కోట్లతో పోలిస్తే 24 శాతం వృద్ధి చెందింది. అదే సమయంలో నికర వడ్డీ మార్జిన్‌ 4.31 శాతం నుంచి 4.53 శాతానికి పెరిగింది. స్థూల నిరర్థక ఆస్తులు (NPAs) 2.76 శాతం నుంచి 2.48 శాతానికి పరిమితమయ్యాయని బ్యాంక్‌ తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని