Piyush Goyal on tariffs: టారిఫ్‌ల అంశాన్ని భారత్‌ జాగ్రత్తగా హ్యండిల్‌ చేస్తోంది: పీయూష్‌ గోయల్‌

Eenadu icon
By Business News Team Updated : 10 Apr 2025 15:59 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

Piyush Goyal on tariffs | ముంబయి: అమెరికా సుంకాల విషయంలో భారత్‌ చాలా తెలివిగా వ్యవహరిస్తోందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ అన్నారు. అమెరికాతో వాణిజ్యాన్ని రెండున్నర రెట్లు పెంచుకోవడంపై తాము దృష్టి సారించామని పేర్కొన్నారు. వివిధ దేశాలపై విధించిన సుంకాలను ట్రంప్‌ 90 రోజుల పాటు నిలిపివేసిన వేళ ఆయన ముంబయిలో విలేకరులతో మాట్లాడారు.

ఇరు దేశాలపై మధ్య ద్వైపాక్షి సంబంధాలను, సులభతర వాణిజ్యం కోసం ప్రధాని నరేంద్రమోదీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ సమక్షంలో ఇరు దేశాలు ఫిబ్రవరిలోనే ఓ ఒప్పందం చేసుకున్నాయని గోయల్‌ అన్నారు. దీనివల్ల ఇరు దేశాల వాణిజ్యం 500 బిలియన్‌ డాలర్లకు చేరుతుందన్నారు. గతంతో పోలిస్తే ఈ మొత్తం రెండున్నర రెట్లు అధికం అన్నారు. దీనివల్ల మరింత మంది ఉద్యోగ అవకాశాలు వస్తాయని, దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందని పీయూష్‌ గోయల్‌ పేర్కొన్నారు.

ప్రస్తుతం ఇరు దేశాల మధ్య వాణిజ్య చర్చల్లో పురోగతి ఉందని, ఇందులో భారత్‌దే పైచేయి అని పీయూష్‌ గోయల్‌ పేర్కొన్నారు. అంతకుముందు వాణిజ్య ఒప్పందాలపై పరిశ్రమ వర్గాల ప్రతినిధులతో భేటీ అయిన ఆయన.. వాణిజ్యం గురించి మాట్లాడారు. ప్రభుత్వానికి దేశ ప్రయోజనాలే ముఖ్యమని, వికసిత భారత్‌ 2047 లక్ష్యాన్ని చేరుకోవడంలో ఈ ద్వైపాక్షిక ఒప్పందం దోహదపడుతుందని పీయూష్‌ గోయల్‌ అన్నారు.

Tags :
Published : 10 Apr 2025 15:58 IST

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు