IndiGo: 2030 నాటికి విమాన సర్వీసులు డబుల్‌..

IndiGo: 2030 నాటికి విమానయాన సర్వీసుల్ని రెండింతలు చేయనున్నట్లు ప్రముఖ ఎయిర్‌లైన్స్‌ ఇండిగో చీఫ్‌ పీటర్‌ ఎల్బర్స్‌ తెలిపారు. 

Published : 27 Mar 2024 23:32 IST

IndiGo | ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో (IndiGo) తన సేవల్ని మరింత విస్తరించాలని చూస్తోంది. దేశీయ, అంతర్జాతీయ మార్గాల్లో సర్వీసులను పెంచేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. 2030 నాటికి తన సర్వీసుల్ని రెండింతలు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ విషయాన్ని కంపెనీ చీఫ్‌ పీటర్‌ ఎల్బర్స్‌ మీడియా సమావేశంలో వెల్లడించారు. కొత్త ఆర్థిక సవత్సరం (ఏప్రిల్‌ 1) నుంచి ప్రతీ వారానికి ఓ విమాన సర్వీసును తీసుకురానున్నట్లు తెలిపారు.

‘‘ దేశీయంగా సేవల్ని పెంచనున్నాం. అయితే అంతర్జాతీయ సర్వీసులను పెంచడంపై మరింత దృష్టి సారించాం. ఏడాదిక్రితం సింగపూర్‌కు ప్రయాణించాలంటే కేవలం మూడు విమాన సర్వీసులు మాత్రమే ఉండేవి. ఇప్పుడు ఆ సంఖ్య ఏడుకు చేరింది. ప్రస్తుతం ఉన్న సర్వీసుల్ని 2030 నాటికి రెట్టింపు చేయనున్నాం. ప్రపంచంలోని టాప్‌టెన్‌ ఎయిర్‌లైన్స్‌లో చోటు సంపాదించడమే మా లక్ష్యం’’ అని మీడియా సమావేశంలో ఎల్బర్స్ పేర్కొన్నారు. భారత్‌లోని విమానయాన సర్వీసుల్లో ఇండిగో కీలక పాత్ర పోషిస్తోందన్నారు.

యాపిల్ WWDC 2024 తేదీలు వచ్చేశాయ్‌..

కరోనా మహమ్మారీ విజృంభనతో నష్టాల్లోకి జారుకున్న ఇండిగో తర్వాత వేగం పుంజుకుంది. గత ఐదు త్రైమాసికాల నుంచి లాభదాయకమైన ఫలితాల్ని ప్రకటించింది. గతేడాదిలో 100 మిలియన్ల ప్రయాణికులు తమ సేవల్ని వినియోగించుకున్నట్లు ప్రకటించింది. దీంతో ఈ ఘనతను సాధించిన మొదటి విమానయాన సంస్థగా ఇండిగో నిలిచింది. ప్రస్తుతం టర్కిష్ ఎయిర్‌వేస్, బ్రిటీష్ ఎయిర్‌వేస్, ఖతర్ ఎయిర్‌వేస్, అమెరికన్ ఎయిర్‌లైన్, కేఎల్‌ఐ -ఎయిర్‌ఫ్రాన్స్, క్వాంటాస్, జెట్‌స్టార్, వర్జిన్ అట్లాంటిక్‌లతో కలిసి ఇండిగో సర్వీసులు అందిస్తోంది. ఇదిలాఉండగా.. డిసెంబర్ 2023 చివరికి ఇండిగో వద్ద 358 విమానాలు ఉన్నాయి. అందులో 31 A320 ceos, 184 A320 neos, 94 A321 neos, 44 ATRలు, 3 A321 ఫ్రైటర్లు, రెండు B777లు ఉన్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని