WWDC 2024: యాపిల్ WWDC 2024 తేదీలు వచ్చేశాయ్‌..

WWDC 2024: యాపిల్‌ ఏటా నిర్వహించే వరల్డ్‌వైడ్‌ డెవలపర్స్‌ కాన్ఫరెన్స్‌ తేదీలను ప్రకటించింది. 

Published : 27 Mar 2024 15:46 IST

WWDC 2024  | ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రముఖ టెక్‌ సంస్థ యాపిల్‌ కొత్త ఆవిష్కరణలు తీసుకురావడానికి సిద్ధమైంది. ఏటా ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే యాపిల్‌ వరల్డ్‌వైడ్‌ డెవలపర్స్‌ కాన్ఫరెన్స్‌ (Apple WWDC) తేదీలను ప్రకటించింది. రానున్న ఏడాదిలో కంపెనీ తీసుకురానున్న కొత్త సాఫ్ట్‌వేర్‌ ఫీచర్లు, ఉత్పత్తుల గురించి యూజర్లకు పరిచయం చేస్తుంటుంది. ఈ ఏడాది కాన్ఫరెన్స్‌(WWDC 2024)ను వర్చువల్‌ వేదికగా జూన్‌ 10 నుంచి జూన్‌14 వరకు నిర్వహించనున్నట్లు వెల్లడించింది.

ప్రస్తుతం ఎక్కడ చూసినా ఏఐ హవా నడుస్తోంది. ఈ తరుణంలో యాపిల్‌ తీసుకురానున్న సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్‌లలో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (AI) ఫీచర్లను జోడించే అవకాశం ఉందని టెక్‌ వర్గాలు భావిస్తున్నాయి. క్లౌడ్ ఆధారిత జెన్‌ఏఐ ఫీచర్‌ను తీసుకొచ్చేందుకు గూగుల్‌, బైదూ.. వంటి ఏఐ సంస్థలతో భాగస్వామ్యం గురించి సమాచారం అందొచ్చని కొన్ని నివేదికలు తెలుపుతున్నాయి. ఇక iOS 18, iPadOS 18, macOS 15, watchOS 11, tvOS 18లో కొత్త ఆపరేటింగ్‌ సిస్టమ్స్‌ (OS) వివరాలను పరిచయం చేస్తారని తెలుస్తోంది.

రెండేళ్లలో 151 నుంచి 80 కిలోలకు.. కంపెనీ సీఈఓ ఇన్‌స్పైరింగ్‌ స్టోరీ

ఐపాడ్‌ ఎయిర్‌, ఓఎల్‌ఈడీ ఐపాడ్‌ ప్రోలో కొత్త మోడల్స్‌ను లాంచ్‌ చేసే అవకాశం ఉందని టెక్‌ నిపుణులు అంచనా వేస్తున్నారు. యాపిల్‌ నిర్వహించనున్న కాన్ఫరెన్స్‌ ఆన్‌లైన్‌ అయినప్పటికీ మొదటి రోజు వ్యక్తిగతంగా వెళ్లి హాజరయ్యే అవకాశం ఉందని సంస్థ తెలిపింది. ఆసక్తి ఉన్న వాళ్లు యాపిల్‌ డెవలపర్‌ యాప్‌, కంపెనీ వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొంది. యాపిల్‌ స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్ విజేతలు కూడా దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని