IndiGo: ఇండిగో విమానాల్లో ఇక వినోదం.. తొలుత ఈ రూట్లోనే..

IndiGo: విమాన ప్రయాణంలో వినోదాన్ని అందించే సేవల్ని మే1 నుంచి అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఇండిగో ఓ ప్రకటనలో పేర్కొంది.

Published : 23 Apr 2024 22:50 IST

IndiGo | దిల్లీ: ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో (Indigo) కొత్తతరహా సేవల్ని అందించేందుకు సిద్ధమైంది. ఇకపై ప్రయాణ సమయంలో వినోదాన్ని జోడించనున్నట్లు తెలిపింది. మే 1 నుంచి ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయని మంగళవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొంది. తన యాప్‌ ద్వారా విమానంలో ఎంటర్‌టైన్‌మెంట్‌ కంటెంట్‌ను అనుభూతి చెందొచ్చని పేర్కొంది.

గుంపులో స్మార్ట్‌ఫోన్లు కొట్టేస్తే.. చిన్న ట్రిక్‌తో పట్టేశాడు..!

దిల్లీ-గోవా మార్గంలో ప్రయాణించే విమానాల్లో ప్రయోగాత్మకంగా వినోదాన్ని అందించే సదుపాయాన్ని పరిచయం చేయనుంది. మూడు నెలల పాటు ట్రయల్‌ ప్రాతిపదికన ఈ సేవల్ని నిర్వహించనున్నట్లు పేర్కొంది. విమానం నిర్ణీత ఎత్తుకు చేరుకున్న తర్వాత ఈ సేవలు ప్రారంభమవుతాయి. ఇండిగో యాప్‌ ద్వారా ఈ సేవలు పొందొచ్చు. అయితే వీటిని ఉపయోగించుకోవాలంటే కస్టమర్లు తమ వ్యక్తిగత హెడ్‌ఫోన్లను తీసుకెళ్లాల్సి ఉంటుంది. ట్రయల్ దశ విజయవంతమైతే ఈ సేవల్ని పూర్తిగా అందుబాటులోకి తేనుంది. ఇండిగో ఈతరహా సేవల్ని తీసుకురావడం ఇదే మొదటిసారి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని