iPhone: టెక్‌ ప్రియులకు బ్యాడ్‌ న్యూస్‌.. ఐఫోన్‌ 15 విడుదల ఆలస్యం!

iPhone 15: యాపిల్‌ సంస్థ నుంచి ఈ ఏడాది సెప్టెంబర్‌లో విడుదల కావాల్సిన ఐఫోన్‌ 15 సిరీస్ రాక ఆలస్యం కానున్నట్లు తెలుస్తోంది.

Published : 21 Jul 2023 18:02 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: యాపిల్‌ విడుదల చేసే ఐఫోన్‌ (iPhones) మోడల్స్‌ విడుదలకు ముందే మార్కెట్‌లో ఓ ట్రెండ్‌ను సెట్‌ చేస్తుంటాయి. వాటి ధర, ఫీచర్ల గురించి చర్చ జరుగుతూనే ఉంటుంది. ఐఫోన్‌ లేటెస్ట్‌ మోడల్‌ ఎప్పుడు విడుదల అవుతుందా? అని ఎదురుచూసే టెక్‌ ప్రియులూ ఉంటారు. అలాంటి ఐఫోన్‌ లవర్స్‌కు ఇది కాస్త బ్యాడ్‌న్యూస్‌. ఎందుకంటే యాపిల్ తన ఐఫోన్‌ 15 (iPhone 15) సిరీస్‌ మొబైల్‌ను మార్కెట్‌లోకి ఆలస్యంగా తీసుకురానున్నట్లు తెలుస్తోంది. 

వాస్తవానికి ఏటా సెప్టెంబర్‌లో కొత్త మోడల్‌ను యాపిల్‌ విడుదల చేస్తుంది. ఈ ఏడాదిలో ఐఫోన్ 15 సిరీస్‌ లాంచ్ మాత్రం కాస్త ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. సెప్టెంబర్‌కు బదులు అక్టోబర్‌లో ఈ ఫోన్‌ను యాపిల్‌ విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. విడుదల సమయానికి ఐఫోన్‌ 15 ప్రో, ఐఫోన్‌ 15 ప్రో మ్యాక్స్‌ ఫోన్లు తగిన సంఖ్యలో అందుబాటులో ఉండకపోవడమే దీని కారణమని తెలుస్తోంది. 

యాపిల్‌ ప్రో మోడళ్లలో వినియోగించే డిస్‌ప్లేలు తయారుచేసే సంస్థలు కొత్త మానుఫ్యాక్చరింగ్‌ ప్రాసెస్‌ను అనుసరిస్తున్నాయి. దీనికి తోడు డిస్‌ప్లేను అందించాల్సిన ఎల్‌జీ సంస్థ డిస్‌ప్లే టెస్టింగ్‌లో అంతరాయం ఎదుర్కొంటుండటంతో విడుదల ఆలస్యం కానున్నట్లు తెలుస్తోంది. 2020లో కొవిడ్‌ మహమ్మరి విజృంభణ కారణంగా ఐఫోన్ 12 సిరీస్‌ విడుదల్లో ఇలానే అంతరాయం ఏర్పడింది. ఐఫోన్‌ 15 సిరీస్‌లో ఐఫోన్‌ ప్రో మోడళ్లతో పాటు ఐఫోన్‌ 15, ఐఫోన్‌ 15 ప్లస్‌ మోడళ్లను యాపిల్‌ తీసుకొస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని