ఐకూ నుంచి నియో 9ప్రో.. 4 ఏళ్ల పాటు సెక్యూరిటీ అప్‌డేట్స్‌

iQOO Neo 9 Pro Launched: ఐకూ సంస్థ నియో 9 ప్రో పేరిట మరో ఫ్లాగ్‌షిప్‌ ఫోన్‌ను తీసుకొచ్చింది. దీని ధర రూ.35 వేల నుంచి ప్రారంభం అవుతుంది.

Published : 22 Feb 2024 13:54 IST

iQOO Neo 9 Pro | ఇంటర్నెట్ డెస్క్‌: చైనాకు చెందిన మొబైల్‌ తయారీ సంస్థ ఐకూ (iQOO) నియో సిరీస్‌లో మరో ఫ్లాగ్‌షిప్‌ ఫోన్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఐకూ నియో9ప్రో (iQOO Neo 9 Pro) పేరుతో దీన్ని తీసుకొచ్చింది. 120W ఫాస్ట్‌ ఛార్జింగ్‌కు ఈ ఫోన్‌ సపోర్ట్‌ చేస్తుంది. ఔటాఫ్‌ది బాక్స్‌ ఆండ్రాయిడ్‌ 14 ఆధారిత ఫన్‌టచ్‌ ఓఎస్‌తో వస్తున్న ఈ ఫోన్‌కు.. మరో మూడు ఆండ్రాయిడ్‌ అప్‌డేట్స్‌ ఇస్తామని కంపెనీ చెబుతోంది. నాలుగేళ్ల పాటు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ కూడా ఇస్తామని హామీ ఇస్తోంది. మరి ఈ ఫోన్‌ ధరెంత? ఫీచర్లేంటి?

ఐకూ నియో 9 ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్‌ మూడు వేరియంట్లలో లభిస్తుంది. బేసిక్‌ వేరియంట్‌ 8జీబీ+128జీబీ ధరను రూ.35,999గా కంపెనీ నిర్ణయించింది. 8జీబీ+256జీబీ వేరియంట్‌  ధర రూ.37,999గా పేర్కొంది. 12జీబీ+256 జీబీ స్టోరేజీ వేరియంట్‌ ధర రూ.39,999గా నిర్ణయించింది. హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ బ్యాంక్‌ కార్డులపై కొనుగోలు చేస్తే రూ.2వేల వరకు డిస్కౌంట్‌ పొందొచ్చు. నలుపు, ఎరుపు రంగుల్లో లభిస్తుంది. బేస్‌ వేరియంట్‌ మినహా మిగిలిన రెండు వేరియంట్లు అమెజాన్‌, ఐకూ ఇ-స్టోర్లలో ఫిబ్రవరి 23 నుంచి అమ్మకానికి రానున్నాయి. ప్రీ బుక్‌ చేసుకున్న వారు 22 మధ్యాహ్నం నుంచే కొనుగోలు చేయొచ్చు. బేస్‌ వేరియంట్ మార్చి 21న అందుబాటులోకి రానుంది.

గూగుల్‌ ప్లే స్టోర్‌కు పోటీ వచ్చేసింది

ఇక ఫీచర్ల విషయానికొస్తే.. ఇందులో 6.78 అంగుళాల 1.5k ఎల్‌టీపీఓ అమోలెడ్‌ డిస్‌ప్లే ఇచ్చారు. 120Hz రిఫ్రెష్‌ రేటు ఉంటుంది. గేమింగ్ సమయంలో 144Hz రిఫ్రెష్‌రేటుతో పనిచేస్తుంది. కొత్తగా వెట్‌ టచ్‌ టెక్నాలజీని ఇందులో పరిచయం చేశారు. దీనివల్ల తడిచేత్తో ఫోన్‌ను ఆపరేట్‌ చేసినా డిస్‌ప్లే పనిచేస్తుంది. స్నాప్‌డ్రాగన్‌ 8 జనరేషన్‌ 2 చిప్‌సెట్‌తో వస్తోంది. ఇందులో వెనుక 50ఎంపీ సోనీ ఐఎంఎక్స్‌ 920 సెన్సర్‌ ఇచ్చారు. ఆప్టికల్‌ ఇమేజ్‌ స్టెబిలైజేషన్‌తో వస్తోంది. 8 ఎంపీ అల్ట్రావైడ్‌ యాంగిల్‌ కెమెరా ఉంది. ముందువైపు 16 ఎంపీ కెమెరా ఇచ్చారు. 5,160 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఉంది. ఇది 120W సూపర్‌వూక్‌ ఛార్జింగ్‌ సదుపాయం ఇచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని