Jio AirFiber: జియో ఎయిర్‌ఫైబర్‌లోనూ డేటా బూస్టర్‌ ప్లాన్‌.. ధర ఎంతంటే?

Jio AirFiber: జియో ఎయిర్‌ఫైబర్‌ బ్రాడ్‌బ్యాండ్‌ సేవల్లోనూ కంపెనీ డేటా బూస్టర్‌ ప్లాన్‌ను తీసుకొచ్చింది. దీంతో అదనంగా 1 టీబీ డేటా లభిస్తుంది.

Published : 05 Dec 2023 02:09 IST

Jio AirFiber | ఇంటర్నెట్‌ డెస్క్‌: ఇటీవలే అందుబాటులోకి వచ్చిన 5జీ ఆధారిత ‘జియో ఎయిర్‌ఫైబర్‌ (Jio AirFiber)’ వైర్‌లెస్‌ బ్రాడ్‌బ్యాండ్‌లో కంపెనీ మరో కొత్త ప్లాన్‌ను తీసుకొచ్చింది. ఇది డేటా బూస్టర్‌. దీని ధర రూ.401. దీన్ని యాక్టివేట్‌ చేసుకోవాలంటే కచ్చితంగా బేస్‌ ప్లాన్‌కు సబ్‌స్క్రైబ్‌ అయ్యి ఉండాల్సిందే. రెగ్యులర్‌, మ్యాక్స్ పేరిట జియో ఎయిర్‌ఫైబర్‌ మొత్తం ఆరు బేసిక్‌ ప్లాన్లను అందిస్తున్న విషయం తెలిసిందే. కనెక్షన్‌ యాక్టివ్‌గా ఉండాలంటే వీటిలో ఏదో ఒక దాన్ని సబ్‌స్క్రైబ్‌ చేసుకోవాలి.

👉 Follow EENADU WhatsApp Channel

తాజాగా తీసుకొచ్చిన రూ.401 డేటా బూస్టర్‌ ప్లాన్‌తో అదనంగా 1టీబీ డేటా లభిస్తుంది. దీని వ్యాలిడిటీ బేసిక్‌ ప్లాన్‌తో పాటే ముగుస్తుంది. అంటే కొత్త బిల్లింగ్‌ సైకిల్‌ ప్రారంభమైతే.. డేటా బూస్టర్‌ ప్లాన్‌ ముగిసినట్లే. అందులో మిగిలిన డేటా ఇక పోయినట్లే. ఒకవేళ ఎక్స్‌ట్రా డేటా కావాలంటే కొత్తగా మళ్లీ డేటా బూస్టర్‌ తీసుకోవాలి. వాస్తవానికి ఈ డేటా బూస్టర్‌ ప్లాన్‌ చాలా తక్కువ మందికే అవసరం కావొచ్చు. బేసిక్‌ ప్లాన్‌లోనే యూజర్లకు నెలకు 3.3 టీబీ డేటా లభిస్తుంది. 100 ఎంబీపీఎస్‌ లేదా అంతకంటే తక్కువ స్పీడ్‌తో కూడిన ప్లాన్లను యాక్టివేట్‌ చేసుకునేవారికి అసలు అదనపు డేటా అవసరమయ్యే అవకాశమే ఉండకపోవచ్చు.

జియో ఎయిర్‌ఫైబర్‌ దీపావళి నుంచి అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 494 పట్టణాలకు దీని సేవలు విస్తరించాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు అన్ని ప్రధాన నగరాల్లో సేవలు అందుబాటులో ఉన్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని