Jio Prepaid Plan: అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో సబ్‌స్క్రిప్షన్‌తో జియో కొత్త ప్లాన్‌

Jio Prepaid Plan: జియో రూ.857తో కొత్త ప్లాన్‌ను ఇటీవల ప్రవేశపెట్టింది. దీంట్లో అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో మొబైల్‌ ఎడిషన్‌ సబ్‌స్క్రిప్షన్‌ ఉంది.

Published : 08 Apr 2024 11:08 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్‌ జియో (Reliance Jio) ఎప్పటికప్పుడు తమ కస్టమర్ల అవసరాలు, అభిరుచులకు అనుగుణంగా కొత్త ప్లాన్లను తీసుకొస్తుంటుంది. ఇటీవల రూ.857తో మరో కొత్త ప్రీపెయిడ్‌ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. దీంట్లో ఓటీటీ ప్రయోజనాలు ఉండడం విశేషం.

రిలయన్స్‌ జియో (Reliance Jio) రూ.857 ప్లాన్‌లో రోజుకు 2జీబీ డేటా, 100 ఎసెమ్మెస్‌లతో పాటు అపరిమిత వాయిస్‌ కాలింగ్‌ లభిస్తాయి. దీని వ్యాలిడిటీ 84 రోజులు. అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో (Amazon Prime Video) మొబైల్‌ ఎడిషన్‌, జియో టీవీ, జియో సినిమా, జియోక్లౌడ్‌ సబ్‌స్క్రిప్షన్‌ వస్తుంది. డేటా రోజువారీ పరిమితి ముగిసిన తర్వాత ఇంటర్నెట్‌ వేగం 64 కేబీపీఎస్‌కు తగ్గిపోతుంది. అపరిమిత 5జీ డేటాను ఎంజాయ్‌ చేయొచ్చు. ఈ ప్లాన్‌లో వస్తున్న అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో మొబైల్‌ ఎడిషన్‌ సబ్‌స్క్రిప్షన్‌ వ్యాలిడిటీ కూడా 84 రోజులు. జియో సినిమాలో మాత్రం ప్రీమియం సభ్యత్వం లభించదు.

జియోభారత్‌ యూజర్ల కోసం..

జియోభారత్‌ ఫోన్‌ (JioBharat phone) యూజర్ల కోసం కూడా ఇటీవల కొత్త ప్లాన్‌ తీసుకొచ్చింది ఈ టెలికాం సంస్థ. దీని ధర రూ.234. వ్యాలిడిటీ 56 రోజులు. ప్రతి 28 రోజులకు 300 ఎసెమ్మెస్‌లు, రోజుకు 0.5జీబీ డేటా, అపరిమిత వాయిస్ కాలింగ్‌ వంటి ఫీచర్లూ ఉన్నాయి. జియోసావన్‌, జియోసినిమా (Jio Cinema) సబ్‌స్క్రిప్షన్‌ లభిస్తాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని