జియో సినిమా ప్రీమియం వార్షిక ప్లాన్‌.. ప్రారంభ ఆఫర్‌ కింద 50% తగ్గింపు

JioCinema: ప్రముఖ వీడియో స్ట్రీమింగ్‌ ప్లాట్‌ఫామ్‌ జియో సినిమా ప్రీమియం వార్షిక ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌ ప్లాన్‌ను తీసుకొచ్చింది. ప్రారంభ ఆఫర్‌ కింద 50శాతం తగ్గింపు అందిస్తోంది.

Updated : 25 May 2024 15:07 IST

JioCinema | ఇంటర్నెట్‌డెస్క్‌: రిలయన్స్‌కు చెందిన స్ట్రీమింగ్‌ ప్లాట్‌ఫామ్‌ జియో సినిమా (Jio Cinema) ప్రీమియం కొత్త వార్షిక సబ్‌స్క్రిప్షన్‌ ప్లాన్‌ను తీసుకొచ్చింది. కొన్నాళ్ల క్రితం నెలవారీ ప్లాన్‌ తీసుకొచ్చిన ఈ సంస్థ.. తాజాగా అందుబాటు ధరలో దీన్ని ప్రవేశపెట్టింది. ఈ సబ్‌స్క్రిప్షన్‌ కింద ఎలాంటి ప్రకటనలూ లేకుండా 4కె రిజల్యూషన్‌తో స్ట్రీమింగ్‌ వీడియోలను చూడొచ్చు.

జియో తీసుకొచ్చిన వార్షిక ప్లాన్‌ ధర రూ.599. ప్రారంభ ఆఫర్‌ కింద వార్షిక సబ్‌స్క్రిప్షన్‌ ధరపై 50శాతం తగ్గింపును అందిస్తోంది. అంటే కేవలం రూ.299కే ప్లాన్‌ లభించనుంది. మొదటి 12 నెలల బిల్లింగ్‌ సైకిల్‌ ముగిశాక సబ్‌స్క్రిప్షన్‌ కావాలంటే పూర్తి మొత్తంలో రీఛార్జి చేసుకోవాల్సి ఉంటుంది. ఏడాది పొడవునా ఒక డివైజ్‌లో ఎలాంటి వాణిజ్య ప్రకటనలు లేకుండా కంటెంట్‌ను వీక్షించొచ్చు. అదీ 4కే వీడియో క్వాలిటీతో. డౌన్‌లోడ్‌ చేసుకొని ఆఫ్‌లైన్‌లోనూ కంటెంట్‌ను ఎంజాయ్‌ చేయొచ్చు. అయితే ప్రస్తుతం జరుగుతున్న ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (IPL) టోర్నమెంట్‌, ఇతర క్రీడలు, ప్రత్యక్ష ప్రసార ఈవెంట్‌లు మాత్రం యాడ్స్‌తో వస్తాయి. జియో మునుపటి వార్షిక ప్లాన్‌ రూ.999తో పోలిస్తే ఇది చాలా తక్కువ.

చివరి నిమిషాల్లోనూ ట్రైన్‌ టికెట్‌ బుక్‌ చేసుకోవచ్చు.. ఈ ఆప్షన్‌ గురించి తెలుసా?

ఇటీవల జియో రూ.29, రూ.89తో (ఫ్యామిలీ ప్యాక్‌) రెండు కొత్త ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌ ప్లాన్లను తీసుకొచ్చింది. ఇవి నెలవారీ ప్లాన్లు. సినిమాలు, హాలీవుడ్‌ బ్లాక్‌బస్టర్లు, పిల్లల షోలు, టీవీ ఎంటర్‌టైన్‌మెంట్‌ను స్మార్ట్‌ టీవీ సహా ఏ డివైజ్‌లోనైనా వీక్షించే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం తీసుకొచ్చిన వార్షిక ప్లాన్‌లోనూ ఈ తరహా సదుపాయాలే ఉన్నాయి. జియో గత నెలలో ప్రీమియం ఫ్యామిలీ సబ్‌స్క్రిప్షన్‌ ఛార్జీలను రూ.149 నుంచి రూ.89కి తగ్గించింది. ఈ ప్లాన్‌లో ఒకేసారి నాలుగు డివైజుల్లో కంటెంట్‌ను వీక్షించొచ్చు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని