5 నిమిషాల ముందూ ట్రైన్‌ టికెట్‌ బుక్‌ చేసుకోవచ్చు.. ఈ ఆప్షన్‌ గురించి తెలుసా?

Railway ticket booking: ట్రైన్‌ బయల్దేరడానికి ఐదు నిమిషాల ముందు కూడా ట్రైన్‌ టికెట్‌ బుక్‌ చేసుకొనే సదుపాయం ఉందని మీకు తెలుసా? అదెలాగంటే..?

Updated : 25 May 2024 15:12 IST

Railway ticket booking | ఇంటర్నెట్‌డెస్క్‌: దూరభారం వెళ్లేటప్పుడు సౌకర్యవంతమైన ప్రయాణం కోసం రైలునే చాలామంది ఎంచుకుంటూ ఉంటారు. అందుకోసం కొన్ని నెలల ముందే ట్రైన్‌ టికెట్లు బుక్‌ చేసుకుంటారు. ఒకవేళ ఒక రోజు ముందు మన ప్రయాణం ఖరారైతే.. తత్కాల్‌ బుకింగ్‌ ఉండనే ఉంది. అదే కొన్ని గంటల ముందు ప్రయాణం నిర్ణయమైతే? అలాంటి వారికి మరో అవకాశం ఉంది. టికెట్లు ఖాళీ ఉంటే రైలు బయల్దేరడానికి ఐదు నిమిషాల ముందు కూడా టికెట్‌ బుక్‌ చేసుకోవచ్చు. అదెలాగంటే?

అనేక కారణాలతో ప్రయాణం రోజునే టికెట్‌ క్యాన్సిల్‌ చేసుకొనే వారు చాలా మంది ఉంటారు. అలాంటి సందర్భంలో ఖాళీగా ఉన్న టికెట్లను విక్రయించేందుకు రైల్వే శాఖ ఈ సదుపాయాన్ని తీసుకొచ్చింది. ప్రతి ట్రైన్‌ టికెట్‌ బుకింగ్‌ కన్ఫర్మేషన్‌ కోసం రైల్వే శాఖ రెండు ఛార్ట్‌లను ప్రిపేర్‌ చేస్తుంది. ఫస్ట్‌ ఛార్ట్‌ అనేది రైలు బయల్దేరడానికి 4 గంటల ముందు ప్రిపేర్‌ అవుతుంది. రెండో ఛార్ట్‌ రైలు స్టార్ట్‌ అవ్వడానికి ముందు రూపొందిస్తారు. గతంలో అరగంట ముందు వరకు మాత్రమే టికెట్‌ బుకింగ్‌కు అనుమతించేవారు. ఇప్పుడు రైలు బయల్దేరడానికి 5 నిమిషాల ముందు వరకు ఆ వెసులుబాటు కల్పించారు. కాబట్టి ట్రైన్‌ స్టార్ట్‌ అయ్యే ఐదు నిమిషాల ముందు కూడా టికెట్లు అందుబాటులో ఉంటే ఆన్‌లైన్‌/ ఆఫ్‌లైన్‌లో బుక్‌ చేసుకోవచ్చు. అప్పటికీ దొరక్కపోతే ప్రత్యామ్నాయాలను చూసుకోవచ్చు.

బంగారం, వెండి ధరలు.. ఏ నగరంలో ఎంతెంత..?

ఎలా తెలుసుకోవాలంటే?

చివరి నిమిషం వరకు ట్రైన్ టికెట్లు బుక్‌ చేసుకోసుకోవడం కోసం ముందుగా అందులో సీట్లు ఖాళీ ఉన్నాయా లేదా తెలుసుకోవాలి. రైల్వే శాఖ ప్రిపేర్‌ చేసే ఆన్‌లైన్‌ ఛార్ట్‌ ద్వారా ఈ విషయం తెలుసుకోవచ్చు. దీనికోసం ముందుగా IRCTC యాప్‌ ఓపెన్‌ చేసి ట్రైన్‌ సింబల్‌పై క్లిక్‌ చేస్తే.. ఛార్ట్‌  వేకెన్సీ సదుపాయం కనిపిస్తుంది. లేదా నేరుగా ONLINE CHARTS వెబ్‌సైట్‌లోకి వెళ్లి చెక్‌ చేయొచ్చు. అక్కడ ట్రైన్‌ పేరు/నంబర్‌, తేదీ, ఎక్కాల్సిన స్టేషన్‌ వివరాలు ఎంటర్‌ చేసి GET TRAIN CHARTపై క్లిక్‌ చేయాలి. వెంటనే తరగతుల వారీగా (ఫస్ట్‌ ఏసీ, సెకెండ్ ఏసీ, థర్డ్‌ ఏసీ, ఛైర్‌ కార్‌, స్లీపర్‌) అందుబాటులో ఉన్న ఖాళీ సీట్ల వివరాలు  కనిపిస్తాయి. సీటు ఉంటే టికెట్‌ బుక్‌ చేసుకోవచ్చు. ఒకవేళ సీట్లు లేకపోతే సున్నా చూపిస్తుంది. కోచ్‌ నంబర్‌, బెర్త్‌... మొత్తం వివరాలు అక్కడే కనిపిస్తాయి. ట్రైన్‌ ప్రారంభం అయ్యే స్టేషన్లలో ఎక్కేవారికే ఈ ఆప్షన్‌ ప్రయోజనకరంగా ఉంటుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు