MG Motor India: ప్రతీ 3-6 నెలలకు ఎంజీ నుంచి కొత్త కారు

MG Motor: జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్‌ ఇండియా రూ.5,000 కోట్ల పెట్టుబడితో హలోల్‌లో రెండో ప్లాంట్‌ను ఏర్పాటుచేయనుంది. తన ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచనుంది.

Published : 20 Mar 2024 22:35 IST

ముంబయి: జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్‌ ఇండియా (MG Motor India) తన ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకోవాలని చూస్తోంది. ప్రతీ 3-6 నెలలకు ఓ కొత్త కారును విడుదల చేయాలని ప్రణాళికలు రచిస్తోంది. అందులోభాగంగానే రూ.5,000 కోట్ల పెట్టుబడితో గుజరాత్‌లోని హలోల్‌లో రెండో ప్లాంట్‌ను ఏర్పాటుచేయనుంది. ఈ విషయాన్ని MG మోటార్ ఇండియా ఛైర్మన్ రాజీవ్ చాబా బుధవారం తెలిపారు. 

చైనా కార్ల తయారీ సంస్థ SAIC, జేఎస్‌డబ్ల్యూ గ్రూప్‌తో కలసి జాయింట్‌ వెంచర్‌ ఏర్పాటుచేసిన సంగతి తెలిసిందే. తాజాగా జాయింట్‌ వెంచర్‌ను ప్రారంభించాయి. హలోల్‌లో ప్రారంభించే ప్లాంట్ ద్వారా కంపెనీ ఉత్పత్తి సామర్థ్యం ఏడాదికి లక్ష నుంచి 3 లక్షలకు పెరగనుందని ఎంజీ మోటార్‌ ఇండి ఛైర్మన్‌ రాజీవ్‌ చాబా తెలిపారు.  ప్రతీ 3-6 నెలలకు ఓ కొత్త కారును విడుదల చేయాలని చూస్తున్నామన్నారు. భారత్‌లోనే వీటిని తయారుచేసి ఇతర మార్కెట్లకు ఎగుమతి చేస్తామని చెప్పారు. 2030 నాటికి దేశీయంగా మిలియన్ యూనిట్ల ఎలక్ట్రిక్‌ వాహనాలను విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.

దశాబ్దం తర్వాత ఎయిర్‌టెల్‌ గ్రూప్‌ నుంచి మరో ఐపీఓ

ఈసందర్భంగా JSW గ్రూప్ ఛైర్మన్ సజ్జన్ జిందాల్ మాట్లాడారు. మారుతీ సుజుకీ మార్కెట్‌ లీడర్‌గా నిలవడానికి గల కారణాన్ని ఈసందర్భంగా గుర్తు తెచ్చుకున్నారు. ‘‘నలభై సంవత్సరాల క్రితం భారత్‌కు వచ్చిన మారుతీ కంపెనీ ఆటో పరిశ్రమ గతినే మార్చేసింది. ఎంతో నాణ్యమైన, అత్యాధునిక కార్లను తీసుకొచ్చింది. దీంతో అంబాసిడర్లు, ఫియట్‌లను ప్రజలు విస్మరించారు’’ అని పేర్కొన్నారు. ఎంజీ కొత్త ఎనర్జీ వాహన విభాగంలోను అదేతరహా అనుభవాన్ని తిరిగి సృష్టించాలనుకుంటున్నట్లు సజ్జన్‌ జిందాల్‌ పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని