క్రోనాక్స్‌ ల్యాబ్ సైన్సెస్‌ ఐపీఓ ప్రారంభం.. పూర్తి వివరాలివే..

Kronox Lab Sciences IPO: క్రోనాక్స్‌ ల్యాబ్‌ సైన్సెస్‌ ఐపీఓ ధరల శ్రేణి రూ.129-136. ఈ ఐపీఓ జూన్‌ 5న ముగియనుంది.

Published : 03 Jun 2024 14:54 IST

దిల్లీ: స్పెషాలిటీ కెమికల్‌ కంపెనీ క్రోనాక్స్ ల్యాబ్‌ సైన్సెస్‌ ఐపీఓ (Kronox Lab Sciences IPO) సోమవారం ప్రారంభమైంది. జూన్‌ 5న షేర్ల సబ్‌స్క్రిప్షన్‌ ప్రక్రియ ముగియనుంది. షేరు ధరల శ్రేణిని రూ.129-136గా నిర్ణయించింది. మదుపర్లు కనీసం 110 షేర్లపై (ఒక లాట్‌) రూ.14,960 పెట్టుబడిగా పెట్టాల్సి ఉంటుంది.

ఈ ఐపీఓలో (Kronox Lab Sciences IPO) పూర్తి షేర్లు ఆఫర్‌ ఫర్‌ సేల్‌ కింద అందుబాటులో ఉండనున్నాయి. ఎలాంటి కొత్త షేర్లను జారీ చేయడం లేదు. గరిష్ఠ ధర వద్ద రూ.130.15 కోట్లు సమీకరించనుంది. ఈ నిధులన్నీ షేర్లు విక్రయించనున్న ఇన్వెస్టర్లు, ప్రమోటర్లకే చెందనున్నాయి. వడోదర కేంద్రంగా పనిచేస్తున్న క్రోనాక్స్‌ కొంత ప్రత్యేక రసాయనాలను తయారుచేస్తోంది. ఫార్మా, బయోటెక్‌, శాస్త్ర పరిశోధనలు - పరీక్షలు, వ్యక్తిగత సంరక్షణ, అగ్రోకెమికల్స్‌, పశువుల ఆరోగ్యం, మెటలర్జీ వంటి పరిశ్రమల్లో వీటిని ఉపయోగిస్తారు.

వడోదరలో క్రోనాక్స్‌ ల్యాబ్‌కు (Kronox Lab Sciences IPO) మూడు పరిశోధన, తయారీ కేంద్రాలున్నాయి. దహేజ్‌లో మరో తయారీ యూనిట్‌ను ఏర్పాటుచేయడానికి స్థలం కొనుగోలు చేసింది. అమెరికా, యూకే, మెక్సికో, ఆస్ట్రేలియా, ఈజిప్టు సహా దాదాపు 20కి పైగా దేశాలకు ఈ కంపెనీ తమ ఉత్పత్తులను ఎగుమతి చేస్తోంది. పబ్లిక్‌ ఇష్యూలో అందుబాటులో ఉన్న షేర్లలో సగం అర్హత గల సంస్థాగత మదుపర్లు, 35 శాతం రిటైల్‌ మదుపర్లు, 15 శాతం సంస్థాగతేతర మదుపర్లకు రిజర్వ్‌ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు