Lava Yuva 5G: 50MP కెమెరా, 5,000mAh బ్యాటరీ.. రూ.10 వేలకే లావా 5జీ ఫోన్‌

Lava Yuva 5G: యువతరాన్ని దృష్టిలోకి ఉంచుకొని లావా కొత్త ఫోన్‌ను విడుదల చేసింది. రూ.10 వేలకే వస్తున్న 5జీ ఫోన్‌ కావడం విశేషం.

Updated : 30 May 2024 14:54 IST

Lava Yuva 5G | ఇంటర్నెట్‌ డెస్క్‌: దేశీయ స్మార్ట్‌ఫోన్‌ తయారీ సంస్థ లావా అందుబాటు ధరలో కొత్త 5జీ ఫోన్‌ను విడుదల చేసింది. యువతరాన్ని దృష్టిలో ఉంచుకొని యువ 5జీ (Lava Yuva 5G) పేరిట దీన్ని తీసుకొచ్చింది. రెండు స్టోరేజ్‌ వేరియంట్లలో వస్తున్న ఈ ఫోన్‌ ధర రూ.10 వేలే కావడం గమనార్హం.

లావా యువ 5జీలో (Lava Yuva 5G) 90Hz రీఫ్రెష్‌ రేటుతో 6.52 అంగుళాల ఎల్‌సీడీ హెచ్‌డీ+ తెర అమర్చారు. యూనిసోక్‌ టీ750 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. 18W ఫాస్ట్‌ ఛార్జింగ్‌తో 5,000mAh బ్యాటరీని ఇచ్చారు. ఆండ్రాయిడ్‌ 13 ఓఎస్‌తో వస్తోంది. ఒక ఓఎస్‌ అప్‌డేట్‌, రెండేళ్ల పాటు సెక్యూరిటీ అప్‌డేట్లను కంపెనీ అందించనుంది. 50MP ప్రధాన కెమెరా, 8MP సెల్ఫీ కెమెరా ఇచ్చారు. మిస్టిక్‌ బ్లూ, మిస్టిక్‌ గ్రీన్ రంగుల్లో అందుబాటులో ఉంది.

లావా యువ 5జీ (Lava Yuva 5G) రెండు వేరియంట్లలో వస్తోంది. 4జీబీ + 64జీబీ స్టోరేజ్ ధర రూ.9,499. 4జీబీ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్‌ ధర రూ.9,999. అమెజాన్‌తో పాటు లావా ఇ-స్టోర్‌, రిటైల్‌ ఔట్‌లెట్లలో ఈ ఫోన్‌ జూన్‌ 5 నుంచి విక్రయానికి రానుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని