Lenovo tab: లెనోవో నుంచి కొత్త ట్యాబ్‌.. ఫీచర్లు ఇవిగో..!

లెనోవో కంపెనీ కొత్త ట్యాబ్‌ను లాంచ్‌ చేసింది. దీని ధరను రూ.17,999గా కంపెనీ నిర్ణయించింది.

Updated : 26 Mar 2024 16:07 IST

Lenovo | ఇంటర్నెట్‌ డెస్క్: ప్రముఖ పీసీల తయారీ కంపెనీ లెనోవో (Lenovo) కొత్త ట్యాబ్‌ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. ఆండ్రాయిడ్ ఓఎస్‌తో పనిచేసే దీన్ని ట్యాబ్‌ 11 పేరుతో తీసుకొచ్చింది. 11 అంగుళాల డిస్‌ప్లే సైజ్‌ కలిగిన ఈ ట్యాబ్‌ వైఫై, ఎల్‌టీఈ వేరియంట్లలో లభిస్తుంది. దీని ధరను రూ.17,999గా కంపెనీ నిర్ణయించింది. ఇందులో ఎల్‌టీఈ వేరియంట్‌ (సిమ్‌ కార్డు) కావాలంటే రూ.21,999 వెచ్చించాల్సి ఉంటుంది. మార్చి 26 నుంచి అమ్మకాలు ప్రారంభవుతాయని కంపెనీ పేర్కొంది.

స్టైలస్‌ ఇన్‌పుట్‌ సదుపాయంతో ఈ ట్యాబ్‌ వస్తోంది. నోట్స్‌ రాసుకోవడానికి నెబో యాప్‌ ఇన్‌బిల్ట్‌గా ఇస్తున్నారు. ఇది మీ చేతి రాతను టెక్స్ట్‌గా మారుస్తుంది. కఠినమైన మ్యాథ్స్‌ ఈక్వేషన్లను పరిష్కరించేందుకు మై స్క్రిప్ట్‌ కాలిక్యులేటర్‌ కూడా ఇస్తున్నారు. డాక్యుమెంట్లను మేనేజ్‌ చేయడానికి Wps ఆఫీస్‌ యాప్‌ ఉంటుంది. అలాగే ఇందులోని లెనోవో ఫ్రీస్టయిల్‌ యాప్‌ ద్వారా ట్యాబ్‌ను పీసీ లేదా ఇంకో ట్యాబ్‌కు కనెక్ట్ చేసుకోవచ్చు.

ఇక ఫీచర్ల విషయానికొస్తే.. 11 అంగుళాల ఐపీఎస్‌ ప్యానెల్‌తో ఈ ట్యాబ్‌ వస్తోంది. మీడియాటెక్‌ హీలియో జీ88 ప్రాసెసర్‌ అమర్చారు. 8 జీబీ ర్యామ్‌ 128జీబీ స్టోరేజీతో వస్తోంది. ఔటాఫ్‌ ది బాక్స్‌ ఆండ్రాయిడ్‌ 13 ఇస్తున్నారు. రెండు మేజర్‌ ఆండ్రాయిడ్‌ అప్‌డేట్లు వస్తాయని కంపెనీ చెబుతోంది. వెనుక వైపు 13 ఎంపీ కెమెరా, ముందు వైపు 8 ఎంపీ కెమెరా ఇచ్చారు. 7040 ఎంఏహెచ్‌ బ్యాటరీ 10W ఫాస్ట్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేస్తుంది. యూఎస్‌బీ టైప్‌-సి పోర్టు ఉంది. వైర్డ్‌ హెడ్‌సెట్‌ వినియోగించుకోవడానికి వీలుగా 3.5 ఎంఎం హెడ్‌ఫోన్‌ జాక్‌ కూడా ఇస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని