Luxury car sales: తొలిసారి ఒకే ఏడాదిలో 50,000 లగ్జరీ కార్ల అమ్మకాలు: ఆడి ఇండియా

Luxury car sales: లగ్జరీ కార్లకు డిమాండ్‌ పెరుగుతున్న నేపథ్యంలో వాటి విక్రయాలు సరికొత్త గరిష్ఠాలను చేరుతాయని ఆడి ఇండియా అధిపతి పేర్కొన్నారు.

Published : 31 Mar 2024 22:14 IST

Luxury car sales | దిల్లీ: దేశంలో లగ్జరీ కార్ల విక్రయాలు సరికొత్త మైలురాయిని చేరనున్నాయని ఆడి ఇండియా (Audi India) అధిపతి బల్బీర్ సింగ్ ధిల్లాన్ ధీమా వ్యక్తం చేశారు. పెరుగుతున్న డిమాండ్‌ కారణంగా ఈ ఏడాది (2024)లో తొలిసారిగా 50,000 యూనిట్ల విక్రయాలు నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించారు.

‘ఏటా లగ్జరీ కార్ల విభాగం వేగంగా వృద్ధి చెందుతోంది. గతేడాదిలో వీటి విక్రయాలు దాదాపుగా 48,500 యూనిట్లకు చేరాయి. అయినప్పటికీ మొత్తం ప్యాసింజర్‌ వాహన అమ్మకాల్లో లగ్జరీ కార్లు 2శాతం కంటే తక్కువగా ఉన్నాయి. మా వ్యాపారాన్ని మరింత విస్తరించేందుకు సన్నాహాలు మొదలు పెట్టాం. గతేడాదిలో వాహన షోరూమ్‌లు 25 ఉన్నాయి. ఈ ఏడాది ముగిసే సమయానికి ఆ సంఖ్యను 30కి పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. 2024లో ఆడి కార్ల విక్రయాలు 50వేల యూనిట్లను దాటనున్నాయి. రానున్న రోజుల్లో రెండంకెల వృద్ధి కనబరుస్తాం’’ అని ఆడి ఇండియా అధిపతి తెలిపారు.

పిల్లల ఆర్థిక భవిష్యత్తు కోసం ఎడెల్‌వీస్‌ సీఈఓ టిప్స్‌

ప్రస్తుత సంవత్సరం మొదటి త్రైమాసికంలో సరఫరా విషయంలో సవాళ్లు ఎదుర్కొన్నామని ఆడి ఇండియా అధిపతి పేర్కొన్నారు. ఆడి కార్ల రిటైల్‌ విక్రయాలు 2022లో 4,187 యూనిట్లుగా ఉండేవి. గతేడాదిలో ఆ విక్రయాలు 89శాతం పెరిగి 7,931 యూనిట్లకు చేరింది. 2022లో 15,822 యూనిట్లుగా ఉన్న మెర్సిడెస్‌ బెంజ్‌ (Mercedes-Benz) అమ్మకాలు 2023 నాటికి 10శాతం పెరిగి 17,408 యూనిట్లకు చేరాయి. ఇక 2023లో బీఎండబ్ల్యూ (BMW) విక్రయాలు 14,172 యూనిట్లను దాటాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని