M&M- Adani: ఈవీ ఛార్జింగ్‌ స్టేషన్ల విస్తరణకు అదానీతో మహీంద్రా జట్టు

M&M- Adani: ఈవీ ఛార్జింగ్ స్టేషన్ల సదుపాయాల్ని విస్తరించడానికి అదానీ టోటల్‌ గ్యాస్‌తో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఎంఅండ్‌ఎం తెలిపింది.

Published : 21 Mar 2024 19:27 IST

దిల్లీ: దేశవ్యాప్తంగా విద్యుత్‌ వాహన ఛార్జింగ్‌ స్టేషన్లు నెలకొల్పేందుకు అదానీ టోటల్‌ గ్యాస్‌ యూనిట్‌తో అవగాహన ఒప్పందం (MOU) కుదుర్చుకున్నట్లు మహీంద్రా అండ్‌ మహీంద్రా (Mahindra & Mahindra) ప్రకటించింది. ఈవీ ఛార్జింగ్‌ సేవల్ని విస్తృతం చేయడానికి ఈ ఒప్పందం తోడ్పాటు అందిస్తుందని కంపెనీ గురువారం ఓ ప్రకటనలో వెల్లడించింది.

మెదడులో చిప్‌తో వీడియో గేమ్‌ ఆడిన పక్షవాత బాధితుడు

ఛార్జింగ్‌ స్టేషన్లను మెరుగుపరిస్తే విద్యుత్‌ వాహన వినియోగదారులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని ఎంఅండ్‌ఎం ప్రెసిడెంట్ విజయ్ నక్రా వెల్లడించారు. ఈవీ వ్యవస్థను విస్తృతం చేయడానికి ఈ ఒప్పందం సాయపడుతుందని తెలిపారు. ఈ భాగస్వామ్యంతో ఛార్జింగ్‌ స్టేషన్లు 1,100కు పెరగనున్నాయన్నారు. విద్యుత్‌ మౌలిక సదుపాయాల్ని పెంచితే ఎలక్ట్రిక్‌ వాహనాల్ని వినియోగించడానికి కస్టమర్లు ముందుకొస్తారని అదానీ టోటల్ గ్యాస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, సీఈఓ సురేష్ పి.మంగ్లానీ అన్నారు. కర్బన ఉద్గారాలు తగ్గించడానికి ఈవీలు సాయపడతాయని ఈసందర్భంగా ఆయన వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు