Viral News: ల్యాప్‌టాప్‌ డెలివరీపై కస్టమర్‌ ఆగ్రహం.. స్పందించిన సంస్థ

Viral News: ఫ్లిప్‌కార్ట్‌ ఇటీవల నిర్వహించిన సేల్‌లో పాల్గొన్న వ్యక్తి రూ.లక్ష విలువచేసే ల్యాప్‌టాప్‌ని బుక్‌ చేసుకున్నాడు. డెలివరీ చూసి షాక్‌ అయ్యాడు.

Published : 21 Jan 2024 19:27 IST

Viral News | ఇంటర్నెట్‌డెస్క్‌: ఆన్‌లైన్‌ వెబ్‌సైట్లలో ఓ వస్తువు బుక్‌ చేస్తే మరో వస్తువు డెలివరీ రావటం. లేదా వాడిన వస్తువో, నకిలీదో తెచ్చి ఇవ్వటం వంటి ఘటనలు సామాజిక మాధ్యమాల వేదికగా బయటకు వస్తుంటాయి. తాజాగా అలాంటి ఘటనే ఓ వినియోగదారుడికి ఎదురైంది. రూ.లక్ష వెచ్చించి ల్యాప్‌టాప్‌ బుక్‌ చేస్తే ఇంటికొచ్చిన పార్సిల్‌ చూసి ఆ కస్టమర్‌ కంగుతిన్నారు. దీనికి సంబంధించిన వీడియోను సోషల్‌మీడియాలో పంచుకున్నాడు. 

రిపబ్లిక్‌ డే సేల్‌ సమయంలో ఆఫర్లు ఉన్నాయన్న ఉద్దేశంతో మధ్యప్రదేశ్‌కు చెందిన సౌరో ముఖర్జీ అనే వ్యక్తి రూ.1.13లక్షలు వెచ్చించి ఇ-కామర్స్‌ వెబ్‌సైట్‌ ఫ్లిప్‌కార్ట్‌లో జనవరి13న ల్యాప్‌టాప్‌ బుక్‌ చేశాడు. జనవరి 14న పార్సిల్‌ వచ్చింది. డెలివరీ బాయ్‌ పార్సిల్‌ని తెరిచి చూపించగానే అందులో ఉన్న ల్యాప్‌టాప్‌ని చూసి షాక్‌ అయ్యాడు. స్క్రీన్‌, కీబోర్డుపై బాగా దుమ్ముఉండటాన్ని చూసి అటు యూజర్‌ ఇటు డెలివరీ బాయ్‌ ఇద్దరూ ఆశ్చర్యపోయారు. దీనికి సంబంధించిన వీడియోను ముఖర్జీ సామాజిక మాధ్యమం ‘ఎక్స్‌’ (గతంలో ట్విటర్‌) లో పోస్ట్‌ చేశాడు. 

2023లో భారత వస్తు సేవల ఎగుమతుల్లో స్వల్ప వృద్ధి

‘రిపబ్లిక్‌ డే సేల్‌లో ఫ్లిప్‌కార్ట్‌ నుంచి ఆసుస్‌ ల్యాప్‌టాప్‌ను ఆర్డర్‌ చేశాను. పాత ల్యాప్‌టాప్‌ను నాకు పంపించారు. ఆన్‌లైన్‌ వేదికల ద్వారా విక్రయించే వస్తువుల్ని నమ్మొద్దు’ అంటూ ఫ్లిప్‌కార్ట్‌, ఫ్లిప్‌కార్ట్‌సపోర్ట్‌ టీమ్‌కి ట్యాగ్‌ చేశాడు. ఆర్డర్‌ చేసిన దానికి బదులు వేరే రంగు ల్యాప్‌టాప్‌ని ఇవ్వటమే కాకుండా ఇప్పటికే వినియోగించిన దాన్ని పంపించారంటూ ముఖర్జీ ఆగ్రహం వ్యక్తం చేశాడు. దీంతో ఆ పోస్ట్‌ కాస్తా వైరల్‌గా మారింది. తమకు కూడా ఇలాంటి అనుభవమే ఎదురైందంటూ కొందరు నెటిజన్లు పెద్ద ఎత్తున కామెంట్లు పెట్టారు. దీనిపై ఫ్లిప్‌కార్ట్‌ స్పందించింది. ‘ఇలా జరిగినందుకు మమ్మల్ని క్షమించండి. ఆర్డర్‌ వివరాలు తెలియజేస్తే మీకు సాయం చేస్తాం’ అంటూ సంస్థ పేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని